బ‌డ్జెట్ లో అదిరిపోయే ఫోన్‌..6,000mAh, ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

50MPతో ప్ర‌ధాన కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇస్తోంది కంపెనీ. Poco C85 5G ఫోన్ కు

బ‌డ్జెట్ లో అదిరిపోయే ఫోన్‌..6,000mAh, ధ‌ర ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్‌: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఫోన్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోకో తన సి సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ చేసింది. Poco C85 5G పేరుతో ఈ కొత్త ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేశారు. కొత్తగా లాంచ్ అయిన ఈ Poco C85 5G ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.9 అంగుళాల డిస్ ప్లే క‌లిగి ఉంటుంది ఈ పోకో ఫోన్‌. 50MPతో ప్ర‌ధాన కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇస్తోంది కంపెనీ. Poco C85 5G ఫోన్ కు 6000mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉంటుంది. 33W ఛార్జ‌ర్ మాత్ర‌మే స‌పోర్ట్ చేయ‌నుంది. Android 15 ఆధారంగా వ‌ర్క్ చేయ‌నుంది.

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభించనుంది. 4 జీబీ+128 జీబీ మోడల్ మొబైల్ ధర రూ.12,500 ఫిక్స్ చేశారు. 6 జీబీ+128 జీబీ మోడల్ మొబైల్ ధర రూ.13,500గా ఉంటుంది. 8 జీబీ+128 జీబీ మోడల్ దాదాపు 15 వేల రూపాయలకు అందించనున్నారు. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు పడితే 1000 రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుందట. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

Next Story