- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pm fasal bima yojana: కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే చేతికి రూ.38,000.. రైతన్నల కోసం కేంద్రం తెచ్చిన బెస్ట్ స్కీమ్
వేలు, లక్షలు ఖర్చు చేసి రైతులు పంటలు వేస్తే కొన్నిసార్లు ఆకస్మిక వరదలు, వర్షాలు రావడంతో నష్టపోతుంటారు. ప్రభుత్వాలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా ఆ డబ్బులు ఎప్పుడు చేతికి వస్తాయో చెప్పలేం.

దిశ, వెబ్ డెస్క్: వేలు, లక్షలు ఖర్చు చేసి రైతులు పంటలు వేస్తే కొన్నిసార్లు ఆకస్మిక వరదలు, కరువు రావడంతో నష్టపోతుంటారు. ప్రభుత్వాలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా ఆ డబ్బులు ఎప్పుడు చేతికి వస్తాయో చెప్పలేం. అలాంటి రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా కేంద్రం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థికసాయం అందిస్తారు. 2016 కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని ప్రారంభించారు. పథకానికి అప్లై చేసుకున్న రైతులు అతితక్కవ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. వర్షాలు లేక కరువు వల్ల పంట నష్టపోయినా, అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయినా, తెగుళ్ల కారణంగా నష్టపోయినా లేదంటే పంట కోసి ఆరబెట్టిన తరవాత 14 రోజుల వరకు ఏదైనా విపత్తు వల్ల నష్టపోయినా పరిహారం కవరేజ్ ఉంటుంది.
విపత్తు జరిగిన తరవాత నష్టాన్ని అంచనా వేసి కేవలం 15 రోజుల్లోపే క్లైయిమ్ మొత్తాన్ని సెటిల్ చేస్తారు. ఏపీ, తెలంగాణలో సైతం ఈ పథకం అమలులో ఉంది. ఖరీఫ్, రబీ సీజన్లలో పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో రైతులు కేవలం రూ.76 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.38,000 వరకు బీమా పొందే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి https://pmfby.gov.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ప్రీమియం చెల్లించి పథకంలో చేరడం మంచింది.






