- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
15 మిలియన్ల పాస్‌వర్డ్‌లను కేవలం సెకన్లలో క్రాక్ చేసిన AI-టెక్నాలజీ
దిశ, వెబ్‌డెస్క్: AI-సాంకేతికత(Artificial Intelligence) వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే దీని కారణంగా నష్టాలు కూడా ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం AI టెక్నాలజీ, ప్రజలు రోజువారి ఉపయోగించే ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లను ఛేదించగలదని నివేదిక పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ హోమ్ సెక్యూరిటీ హీరోస్ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, AI టెక్నాలజీ 15 మిలియన్లకు(1,56,80,000 పాస్‌వర్డ్‌లు) పైగా పాస్‌వర్డ్‌లను కేవలం నిమిషంలోపే ఛేదించిందని తెలిపింది. రోజువారి ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో ఇది 51 శాతానికి సమానం. దీని ద్వారా సైబర్ నేరస్థులు వినియోగదారుల పాస్‌వర్డ్‌లను దొంగలించడం సులువు అవుతుందని, వ్యక్తిగత డేటా చోరి కి గురయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
AI- పాస్‌వర్డ్ క్రాకింగ్ టూల్, PassGAN ద్వారా కేవలం నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే సుమారు 1,56,80,000 పాస్‌వర్డ్‌ల లిస్టును క్రాక్ చేశారు. 65 శాతం పాస్‌వర్డ్‌లను ఒక గంటలోపు, 71 శాతం ఒక రోజులోపు, 81 శాతం ఒక నెలలోపు క్రాక్ చేయబడ్డాయి. పాస్‌వర్డ్ ఆరు కంటే తక్కువ లేదా అంతకంటే తక్కువ అక్షరాలు కలిగి ఉన్నట్లయితే AI క్షణాల్లో క్రాక్ చేస్తుంది. సింబల్స్, ప్రత్యేక అక్షరాలతో మొత్తం ఏడు అక్షరాలు కలిగిన పాస్‌వర్డ్‌ను ఆరు నిమిషాల కంటే తక్కువ టైంలో ఛేదించింది. కానీ 18 కంటే ఎక్కువ అక్షరాలతో పాస్‌వర్డ్‌లు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు AI-సాంకేతికత కారణంగా ప్రజల వ్యక్తిగత సమాచారం చోరికి గురయ్యే అవకాశం ఏర్పడింది. కనీసం 15 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉండే పాస్‌వర్డ్‌ను ఎంచుకోవడం ద్వారా సైబర్ నేరస్తులకు మీ పాస్‌వర్డ్ దొరికే అవకాశం ఉండదని నిపుణులు తెలిపారు. పాస్‌వర్డ్‌లో లెటర్స్, సింబల్స్, నెంబర్లు, అప్పర్, లోయర్-కేస్ అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతి 3 నుంచి 5 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్ మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టేక్కవచ్చని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.