Oppo A6s Pro :బ‌డ్జెట్ లో ఒప్పో ఫోన్‌.. 5000mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే !

by velandi.Saikiran |

కొత్తగా వస్తున్న ఈ Oppo A6s Pro ఫోన్... ఒప్పో ఎఫ్ 33 ప్రో మోడల్ లాగే ఉండే అవకాశాలు ఉన్నాయి.

Oppo A6s Pro :బ‌డ్జెట్ లో ఒప్పో ఫోన్‌.. 5000mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో ఒప్పో ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. సామాన్యులను కూడా అట్రాక్ట్ చేసేలా ఒప్పో సరికొత్త మోడల్స్ తీసుకువస్తోంది. ధర విషయంలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుగోలు చేసేలా జాగ్రత్త పడుతోంది ఒప్పో. అయితే ఈ క్రమంలో ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. ఒప్పో A6S ప్రో ( Oppo A6s Pro ) పేరుతో రాబోతున్న కొత్త ఫోన్ ఏప్రిల్ 14వ తేదీన చైనాలో మొదట లాంచ్ కానుంది. మన ఇండియాలో మే చివరలో లేదా జూన్ మాసంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Oppo A6s Pro ఫీచ‌ర్స్‌, ధ‌ర !

కొత్తగా వస్తున్న ఈ Oppo A6s Pro ఫోన్... ఒప్పో ఎఫ్ 33 ప్రో మోడల్ లాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. 6.57 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 7000mah. ఇక ఈ ఒప్పో ఫోన్ ప్రధాన కెమెరా 50 ఎంపీ ఉండనుండ‌గా, సెల్ఫీల కోసం 16 MP ఉంటుంది. ఇందులో 8/128GB, 8/256GB, 12/256GB, 12/512GB నాలుగు వేరియంట్స్ వస్తున్నాయి. మూడు కలర్స్ లో ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో లక్కీ లోటస్, మూన్ లైట్ నైట్, అజూర్ స్కై కలర్స్ లో ఈ మొబైల్ రానుంది. మీడియా టెక్ డైమండ్ సిటీ 6300 చిప్ సెట్ ఈ మొబైల్ కు అందిస్తున్నారు.

Next Story