వ‌న్ ప్ల‌స్ నుంచి అదిరిపోయే ఫోన్‌..9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే

by velandi.Saikiran |

OnePlus Nord 6 ఫోన్ 9000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో లాంచ్ అయింది.

వ‌న్ ప్ల‌స్ నుంచి అదిరిపోయే ఫోన్‌..9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వన్ ప్లస్ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ కు ఇండియాలో మంచి గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా ఈ కంపెనీ నుంచి ఫోన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ ( OnePlus Nord 6 ) లాంచ్ అయింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ మొబైల్స్ సేల్స్ కూడా ప్రారంభమయ్యాయి. వీటి ప్రారంభ ధర రూ. 35 వేలు.

వన్ ప్లస్ నార్డ్ 6 ఫీచర్స్ ఇవే

6.78 ఇంచుల డిస్ ప్లేతో రిలీజ్ అయిన ఈ OnePlus Nord 6 ఫోన్, 9000 mAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సిల్వర్, ఫ్రెష్ మింట్, లో రిఫ్లెక్షన్ పిచ్ బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మిడిల్ క్లాస్ జనాలను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు వాడితే ధర కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి.

Next Story