- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8000 mah సూపర్ బ్యాటరీతో వన్ ప్లస్ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
OnePlus Ace 6 Pro Max పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్: వన్ ప్లస్ బ్రాండ్ నుంచి రకరకాల మొబైల్ ఫోన్స్ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. త్వరలో ఈ కంపెనీ నుంచి మరో మొబైల్ రానుంది. OnePlus Ace 6 Pro Max పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ మొబైల్ లాంచింగ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ నవంబర్ చివరలో వచ్చే ఛాన్సులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ను 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకువస్తున్నారు.
100W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. 6.7 ఇంచుల డిస్ప్లే కలిగి ఉండనున్న ఈ ఫోన్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ఆధారంగా పని చేయనుంది. ఇండియాలో ఆన్ రైడ్ 16 వెర్షన్ లో రానుంది. 50MP + 8MP (UW) ప్రైమరీ కెమెరా ఉండనుంది. OnePlus Ace 6 Pro Max పేరుతో వస్తున్న ఈ ఫోన్ మూడు కలర్స్ లో అందబాటులోకి రానుంది. ఫ్రెష్ బ్లాక్, ఎలక్ట్రిక్ పర్పల్, షాడో గ్రీన్ కలర్స్ లభించనుంది. ఇక ఈ ఫోన్ కేవలం 216 గ్రాములు మాత్రమే ఉంటుందట.






