- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OnePlus 15T: 7,500mAh బ్యాటరీతో వన్ ప్లస్..ధర, ఫీచర్స్ ఇవే
OnePlus 15T పేరుతో కొత్త ఫోన్ రానుంది. 7,500mAh బ్యాటరీతో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు.

OnePlus 15T confirmed to feature LUMO periscope lens, 7,500mAh battery soon
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో మొబైల్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. జనాలు ఒక్కొక్కరు రెండు లేదా మూడు ఫోన్లు వినియోగిస్తున్నారు. దీంతో రకరకాల కంపెనీలు ఇండియాలో సరికొత్త మోడల్స్ తో ఫోన్స్ తీసుకొస్తున్నాయి. ఇక మంచి ఫీచర్స్ ఉన్న వాటిని జనాలు కూడా వెంటబడి కొనేస్తున్నారు. పాత ఫోన్ లను మూలన పడేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా మంచి ఆఫర్లు పెట్టి, మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్స్ తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వన్ ప్లస్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ వన్ ప్లస్ కు సంబంధించిన 15T మోడల్ ఫోన్ ( OnePlus 15T ) ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే తేదీ ఫిక్స్ కాలేదు కానీ.. అతి త్వరలోనే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
వన్ ప్లస్ 15T ఫోన్ ఫీచర్స్, ధర
ఇండియన్ మార్కెట్ లో త్వరలోనే లాంచ్ కాబోతున్న వన్ ప్లస్ 15 T మొబైల్ ( OnePlus 15T ) మే లేదా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6.31 అంగుళాలు ఉన్న ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ 7500 mah సామర్థ్యంతో రానుంది. 100w సామర్ధ్యమున్న ఛార్జర్ మాత్రమే ఈ OnePlus 15T ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో రాబోతుంది. సెల్ఫీల కోసం 16 MP కెమెరా అందిస్తున్నారు. ఇక ఇండియన్ మార్కెట్లో ఈ మొబైల్ ప్రారంభ ధర 43 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. చైనాలో ఈ మొబైల్ ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.






