బడ్జెట్ ధరలో నోకియా స్మార్ట్ ఫోన్ విడుదల

by Disha Web |
బడ్జెట్ ధరలో నోకియా స్మార్ట్ ఫోన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నోకియా కంపెనీ నుంచి ఇండియాలోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ మోడల్ పేరు ‘C12’. దీని ధర రూ. 5,999. డార్క్ సియాన్, చార్‌కోల్, లైట్ మింట్ కలర్స్‌లలో మార్చి 17 నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల HD+ డిస్ప్లే, బ్రైట్‌నెస్ బూస్ట్, సెల్ఫీ నాచ్‌ని కలిగి ఉంది. Unisoc 9863A1 ఆక్టాకోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 2GB RAM, 64GB మెమరీని కలిగి ఉంది. బ్యాక్ సైడ్ LED ఫ్లాష్‌తో 8MP కెమెరా, ముందు 5MP కెమెరా ఉన్నాయి. 5W చార్జింగ్‌‌తో 3000mAh బ్యాటరీ ఉంది. స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో రన్ అవుతుంది. దమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్‌ చేయబడింది.

Next Story