త్వరలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-11 14:51:57  IST  )

యూపీఐ లావాదేవీలపై కేంద్రం ఛార్జీలు విధించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
X

దిశ‌, వెబ్ డెస్క్: యూపీఐ లావాదేవీలపై కేంద్రం ఛార్జీలు విధించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రూ.3వేలు దాటితే ఛార్జీలు అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారంటూ వదంతులు సృష్టిస్తున్నార‌ని పేర్కొంది.

త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని వినియోగ‌దారుల‌కు సూచించింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ యూపీఐ ద్వారానే లావాదేవీలు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు డ‌బ్బులు పంపాలి అంటే గంట‌లు త‌ర‌బ‌డి బ్యాంకుల వ‌ద్ద క్యూలో నిలబడాలి. కానీ గ‌త రెండు మూడు సంవ‌త్స‌రాలుగా యూపీఐ సేవ‌ల‌కు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా అల‌వాటు ప‌డ్డారు. ఫోన్ నంబ‌ర్ లింక్‌తో ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ వినియోగిస్తూ వేలు, లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ వార్తలు రావడంతో కంగారు పడ్డారు.

Next Story