- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smartphone Addiction: స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా వాడితే సచ్చారే .. సంచలన అధ్యయనం అవుట్
Smartphone: స్మార్ట్ ఫోన్(Smartphone) కు దూరంగా ఉండటం వల్ల మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ కు సంబంధించిన భాగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని కొత్త అధ్యయనం చెబుతోంది.

దిశ, వెబ్ డెస్క్: Smartphone: స్మార్ట్ ఫోన్(Smartphone) కు దూరంగా ఉండటం వల్ల మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ కు సంబంధించిన భాగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని కొత్త అధ్యయనం చెబుతోంది. ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్లు, మానసికస్థితి, భావాలు, వ్యసనాన్ని నియంత్రిస్తాయని పేర్కొంది.
స్మార్ట్ ఫోన్(Smartphone) ..దీని చుట్టే ప్రపంచం తిరుగుతోంది. తినకుండా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్(Smartphone) లేకుండా మాత్రం ఉండలేరు. స్మార్ట్ ఫోన్ (Smartphone)లేనిదే జీవితం లేదు అనే పరిస్థితుల్లో నేడు మనం ఉన్నాం. అందుకే స్మార్ట్ ఫోన్ వ్యసనం(Smartphone addiction)..అనే ఈ అంశపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం ఒక వ్యసనం వంటిందని ఎంతో మంది చెబుతూనే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ (Smartphone addiction)వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ఎన్నో నివేదికలు తేల్చి చెప్పాయి. అయినా కూడా స్మార్ట్ ఫోన్(Smartphone addiction) మన జీవితాలనే శాసిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్ వ్యసనం (SPA) అనే పదాన్ని అనేక మానసిక పరీక్షలలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త అధ్యయనాలు కూడా దీనిని సూచించాయి.
మనం స్మార్ట్‌ఫోన్(Smartphone)కు దూరంగా ఉన్నప్పుడు మన మెదడులో మార్పులు కనిపిస్తాయని అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్(Computers in Human Behavior) అనే పత్రికలో ప్రచురించింది. ఈ అధ్యయనం 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న 25 మంది యువకులపై నిర్వహించింది. ఆ 25 మందిని 72 గంటలు..మూడు రోజులు ఫోన్(Smartphone)కు దూరంగా ఉంచారు. అనంతరం వారి మెదడులను స్కాన్ చేసినప్పుడు, మెదడులోని ఆ భాగాలలో డోపమైన్(Dopamine), సెరోటోనిన్(Serotonin)కు సంబంధించిన మార్పులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్లు(Neurotransmitters), మానసిక స్థితి, భావాలు, వ్యసనాన్ని నియంత్రిస్తాయి.
ఈ అధ్యయనంలో 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 మంది యువకులను చేర్చారు. అందరూ సాధారణ స్మార్ట్‌ఫోన్(Smartphone)లను ఉపయోగించారు. వాటిపై పరిశోధన చేయడానికి ముందు, యువకులను శారీరకంగా, మానసికంగా పరీక్షించారు. చదువుకునేటప్పుడు స్మార్ట్‌ఫోన్(Smartphone)లను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే సమస్యలు యువతపై ప్రభావం చూపకూడదని నిర్ధారించారు. దీనితో పాటు, యువత మానసిక స్థితి, వారి స్మార్ట్‌ఫోన్ అలవాట్లకు సంబంధించిన ప్రశ్నలు సహా రెండు సెట్ల ప్రశ్నలను పరిష్కరించారు.
అధ్యయనంలో చేర్చిన యువత మూడు రోజుల పాటు వారి రోజువారీ పనులను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సమయం గడిపారు. ఇది తప్ప, వేరే ఏ పని చేయలేదు. ఈ కాలంలో, యువకులకు మానసిక పరీక్షలు నిర్వహించారు. వారి మెదడును స్కాన్ చేశారు. స్కానింగ్ కోసం fMRI ఉపయోగించారు. fMRI అంటే ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(Functional magnetic resonance imaging). ఇది మెదడు కార్యకలాపాలను నిజ సమయంలో గమనించగల సాంకేతికత.
స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా, ఏదైనా మాదకద్రవ్య వ్యసనం నుండి దూరంగా ఉన్నప్పుడు కనిపించే విధంగానే మెదడులో కూడా కార్యకలాపాలు కనిపిస్తాయని అధ్యయన ఫలితాలు చూపిస్తున్నాయి. ఇందులో పాల్గొనేవారి మెదడులోని కొన్ని భాగాలలో కూడా మార్పులు గుర్తించారు. ఈ మార్పులు డోపమైన్(Dopamine), సెరోటోనిన్Serotonin)కు సంబంధించినవి. ఇవి న్యూరోట్రాన్స్మిటర్లు, మన భావాలను, వ్యసనాన్ని నియంత్రిస్తాయి.
స్మార్ట్‌ఫోన్(Smartphone)లు మన మెదడులను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఈ దిశలో కొత్త అధ్యయనం సహాయపడుతుంది. స్మార్ట్‌ఫోన్ వ్యసనం(Smartphone addiction) వంటి పదాలు మనకు వర్తించకుండా ఉండటానికి మనం మెరుగైన అలవాట్లను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం రుజువు చేస్తుంది.






