- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో ఓపెన్ ఏఐ కొత్త సేవలు.. అదిరిపోయే ఫీచర్లు!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) భారత్‌లో మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్‌జీపీటీ గో (ChatGPT Go) పేరుతో న్యూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) భారత్‌లో మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జీపీటీ-5 మోడల్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ గో (ChatGPT Go) పేరుతో న్యూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.399లకే ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు ఫైల్ అప్‌లోడ్‌ల సంఖ్య నుంచి మొదలుకొని.. మెసేజెస్, ఇమేజ్ జనరేషన్‌కు సంబంధించి లిమిట్ అధికంగా లభిస్తుంది. అంతేకాదు, ఇండిక్ లాంగ్వేజీ సపోర్టుతో పాటు యూపీఐ విధానంలోనూ పేమెంట్స్ చేసే సౌలభ్యాన్ని అందించనుంది.
ఇక ఉచిత ప్లాన్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ గోలో మెసేజ్ లిమిట్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లు 10 రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. మెమొరీ కూడా ఉచిత ప్లాన్‌తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉండనుంది. భారత్‌లో ఓపెన్ ఏఐ టూల్స్‌కు భారీగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా.. సంస్థ చాట్‌జీపీటీ గో పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లుగా వెల్లడించింది. ఇక ఇదివరకే చాట్‌జీపీటీ ప్లస్ ప్లాన్ ధర నెలకు రూ.1,999, నిపుణులు, ఎంటర్‌ప్రైజ్‌ల కోసం చాట్‌జీపీటీ ప్రో ప్లాన్‌ను నెలకు రూ.19,900 అందుబాటులో ఉండగా, వాటికి అదనంగా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది.






