- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్... బిజినెస్ అకౌంట్‌లో సరికొత్త ఫీచర్
వాట్సాప్.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్. దాదాపు ఈ యాప్ ప్రతిఒక్కరి మొబైల్ ఫోన్లలో ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్. దాదాపు ఈ యాప్ ప్రతిఒక్కరి మొబైల్ ఫోన్లలో ఉంటుంది. సాధారణ మెసెజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ ఏది కావాలి అన్నా వాట్సాప్ ద్వారానే పంపుకుంటారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లతో యూజర్లను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్ ఉన్న సంగతి తెలిసిందే.
చాలా మంది వ్యాపారులు దీనిని వినియోగిస్తున్నారు. షాపింగ్, ఫుడ్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల వారు బిజినెస్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. అయితే బిజినెస్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి యూజర్లకు సేఫ్టీ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ అనే ఫీచర్ తీసుకువచ్చింది. మెటా వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్‌కు బ్యాడ్జ్ ఉంటుంది. బ్యాడ్జ్ అంటే ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్లకు ఉన్నట్టుగా టిక్ మార్క్ ఉంటుంది. ఇలాంటి టిక్ మార్క్ ఇన్ స్టాలోనూ సెలబ్రెటీల ఖాతాలకు కనిపిస్తుంది. కాబట్టి వాట్సాప్ యూజర్లు షాపింగ్ చేయాలి అనుకుంటే వెరిఫైడ్ ఖాతాలలోనే కొనుగోలు చేయాలని దాని వల్ల సేఫ్టీ ఉంటుందని మెటా సూచిస్తుంది.






