అచ్చం ఫేస్ బుక్ మాదిరిగా వాట్సాప్‌లో కొత్త ఫీచర్

by Ajay Maddhiboyina |

అచ్చం ఫేస్ బుక్ మాదిరిగానే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. చాలా ఏళ్ల క్రితం నుండి ఫేస్ బుక్‌లో ప్రొఫైల్ పిక్చర్ వెనకాల కవర్ ఫోటో పెట్టుకునే ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది వాట్సాప్‌లోకి కూడా రాబోతుంది.

అచ్చం ఫేస్ బుక్ మాదిరిగా వాట్సాప్‌లో కొత్త ఫీచర్
X

దిశ, వెబ్ డెస్క్: అచ్చం ఫేస్ బుక్ మాదిరిగానే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. చాలా ఏళ్ల క్రితం నుండి ఫేస్ బుక్‌లో ప్రొఫైల్ పిక్చర్ వెనకాల కవర్ ఫోటో పెట్టుకునే ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది వాట్సాప్‌లోకి కూడా రాబోతుంది. ఇప్పటికే వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్లకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు సాధారణ వినియోగదారులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ మాతృ సంస్థ మెటా నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు ప్రొఫైల్ క‌స్ట‌మైజేష‌న్ ను మ‌రింత విస్త‌రించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే ఇటీవ‌లే వాట్సాప్ ఒకే యాప్ లో రెండు అకౌంట్స్ ఉప‌యోగించేలా ఆప్ష‌న్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా కంటెంట్ కాపీకి సంబంధించిన మ‌రో అప్డేట్ కూడా తీసుకువ‌చ్చింది. ఇక ఇప్పుడు క‌వ‌ర్ ఫోటో ఆప్ష‌న్ తీసుకురావ‌డంతో వాట్సాప్ యూజ‌ర్ల‌ను మ‌రింత ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు అర్థం అవుతోంది.

Next Story