హై ఎండ్ ఫీచర్స్.. కానీ ధర మాత్రం తక్కువ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
హై ఎండ్ ఫీచర్స్.. కానీ ధర మాత్రం తక్కువ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Motorola కంపెనీ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ విడుదలైంది. దీని పేరు ‘Moto G13’. G-సిరీస్‌లో భాగంగా హై ఎండ్ ఫీచర్స్‌ను తక్కువ ధరలో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 4GB RAM, 64GB స్టోరేజ్ ధర రూ. 9,999. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఏప్రిల్ 5 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ లావెండర్ బ్లూ, మాట్ చార్కోల్ కలర్స్‌లో లభిస్తుంది.


Moto G13 స్పెసిఫికేషన్లు

* 6.5-అంగుళాల HD+ (720 x 1600) LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.

* Arm Mali-G52 MC2 GPU ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌‌తో వస్తుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* 10W చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంది.

* IP52 రేటింగ్‌తో కూడా వస్తుంది.


Next Story

Most Viewed