మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఈసారి ఎంతంటే ?

by velandi.Saikiran |

మొబైల్ వినియోగదారులపై 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెంచాలని ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియా ( VI), జియో నిర్ణయం

మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఈసారి ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి టెలికాం కంపెనీలు. మరోసారి రీఛార్జ్ ఛార్జీలు పెంచేందుకు భారతీయ టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెంచాలని ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియా ( VI), జియో నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

199 రూపాయలు ఉన్న రీఛార్జ్ ప్లాన్ ను రూ.222ల‌కు పెంచబోతున్నారట. అలాగే రూ. 899 రీఛార్జ్ ను 1006 రూపాయలకు పెంచాల‌ని భావిస్తున్నాయ‌ట టెలికాం కంపెనీలు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయట. కొత్త సంవత్సరం కంటే ముందే పెంచి, జనాల డ‌బ్బులు పిండేయాలని భారీ స్కెచ్ వేసాయట‌ టెలికాం కంపెనీలు. ఇక ఈ వార్త వైర‌ల్ కావ‌డంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉలిక్కి ప‌డుతున్నారు. ఇంకా ఎన్నిసార్లు రీఛార్జ్ ఛార్జీలు పెంచుతార‌ని ఫైర్ అవుతున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Next Story