రూ.7 వేల‌కే అదిరిపోయే ఫోన్‌..5000 బ్యాట‌రీ..అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

లావా షార్క్ 2 4G ( Lava Shark 2 4G) పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చారు.

రూ.7 వేల‌కే అదిరిపోయే ఫోన్‌..5000 బ్యాట‌రీ..అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత మార్కెట్లోకి రకరకాల మొబైల్స్ వస్తున్నాయి. ఇప్పటికే తక్కువ ధరలో పలు కంపెనీల నుంచి మొబైల్ ఫోన్స్ రాగా.. లావా నుంచి సరికొత్త మోడల్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లావా షార్క్ 2 4G ( Lava Shark 2 4G) పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కంపెనీ. 6.75 అంగుళాల హెచ్ డి డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వర్క్ చేస్తుంది. 50 ఎంపీ రేర్ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా కూడా ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కూడా అందిస్తున్నారు. 4gb+64gb మోడల్ 7 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా కార్డులు వాడితే మొబైల్ ధ‌ర మరింత తగ్గే ఛాన్సులు ఉంటాయి.

Next Story