Lava Blaze Pro 5G : విడుదలకు సిద్ధంగా ‘లావా బ్లేజ్ ప్రో 5G’

by Disha Web Desk 17 |
Lava Blaze Pro 5G : విడుదలకు సిద్ధంగా ‘లావా బ్లేజ్ ప్రో 5G’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ లావా కంపెనీ నుంచి త్వరలో ‘బ్లేజ్ ప్రో 5G’ మోడల్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఇదే వెర్షన్‌లో గత ఏడాది నవంబర్‌లో బ్లేజ్5G మోడల్ లాంచ్ అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ గురించిన ఫీచర్లను ఒక టిప్‌స్టర్ విడుదల చేశారు. అతను పేర్కొన్న దాని ప్రకారం, ‘బ్లేజ్ ప్రో 5G’ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌తో రానుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. MediaTek డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. బ్యాక్‌సైడ్ కెమెరా సెటప్‌ ప్రక్కన సిల్వర్ కలర్ షేడ్‌‌ను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మెరుగైన క్వాలిటీ ఫొటోలు, వీడియోల కోసం AI ఫీచర్‌ను కూడా అందించినట్లు సమాచారం. అంచనాల ప్రకారం, ఈ ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉండవచ్చని తెలుస్తోంది.



Next Story

Most Viewed