- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jump Deposit Scam: మీ అకౌంట్లో సడెన్ గా డబ్బులు పడ్డాయా...అయితే అది జంప్ డిపాజిట్ స్కామ్ అయ్యే ఛాన్స్.!!
Jump Deposit Scam: మార్కెట్ లోకి కొత్త స్కామ్ వచ్చింది. అదే జంప్ డిపాజిట్ స్కామ్.

Jump Deposit Scam: మీ అకౌంట్లో సడెన్ గా డబ్బులు పడ్డాయా...అయితే అది జంప్ డిపాజిట్ స్కామ్ అయ్యే ఛాన్స్.!!
దిశ, వెబ్ డెస్క్ :Jump Deposit Scam: మార్కెట్ లోకి కొత్త స్కామ్ వచ్చింది. అదే జంప్ డిపాజిట్ స్కామ్. ఈ స్కామ్ లో స్కామర్ ఏం చేస్తాడంటే మన అకౌంట్ కి నిజంగానే రూ. 2000 నుంచి రూ. 5000 పంపిస్తాడు. మీ అకౌంట్ లో డబ్బులు పడగానే బ్యాంకు నుంచి SMS వస్తుంది. ఇలా మీ బ్యాంక్ అకౌంట్ లో రూ. 2000 పడ్డాయి అని కనిపిస్తుంది.
మనం ఆ sms చూసి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నిజమేనా అని చెక్ చేసుకుంనేందుకు, యూపిఐ యాప్ ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటాం, ఇక్కడే స్కామర్ మన బలహీనతను అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. మనం యూపిఐ యాప్ ని ఓపెన్ చేసే లోపే మనకి మనీ రిక్వెస్ట్ ని పంపిస్తాడు. యూపిఐ యాప్ లో మనీ రిక్వెస్ట్ రాగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్ పే నుంచి లేదా google పే నుంచి, లేదా paytm నుంచి ఏదో ఒక యూపిఐ యాప్ నుంచి ఈ నోటిఫికేషన్ రాగానే మనం ఆ కంగారులో ఈ విషయం మనం గమనించము.
డబ్బులు పడ్డాయి అని యూపిఐ యాప్ నోటిఫికేషన్ వచ్చిందని గుర్తించి దానిపై క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే అక్కడ పే అని ఉంటుంది పే అని చెప్పి మనీ రిక్వెస్ట్ రూ. 20,000 నుంచి రూ.30,000 పంపిస్తాడు ఉదాహరణకు స్కామర్ రూ.20000 రిక్వెస్ట్ పంపాడు అనుకుందాం.
మీరు మనీ రిక్వెస్ట్ చూసుకోకుండా పే ని క్లిక్ చేస్తారు. యూపిఐ పిన్ ని ఎంటర్ చేస్తారు. ఆ కంగారులో పిన్ ని ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ కనిపిస్తుందేమో అనుకుంటాం, కానీ మనం ఇండైరెక్ట్ గా యూపిఐ పిన్ ని మనీ పంపడానికి నొక్కామని గుర్తంచలేము. సో అలా యూపిఐ పిన్ ని ఎంటర్ చేయగానే మీ అకౌంట్లో రూ. 20,000 కట్ అయ్యి స్కామర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి.
అందుకే మీ బ్యాంక్ అకౌంట్ లో ఎవరైనా నిజంగా డబ్బులు వేస్తే వెంటనే చెక్ చేసుకోకండి. ఫస్ట్ యూపిఐ యాప్ ని ఓపెన్ చేయకండి. మీ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో చెక్ చేసుకోండి. లేదంటే డబ్బులు పడ్డ 30 నిమిషాల వరకు వెయిట్ చేయండి. అలా 30 నిమిషాలు వెయిట్ చేస్తే ఆ మనీ రిక్వెస్ట్ అనేది ఎక్స్ పైరీ అయిపోతుంది. లేదా రాంగ్ పిన్ ని ఎంటర్ చేసినా కూడా ఎక్స్ పైరీ అయిపోతుంది.






