- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా.. కారణాలు ఇవే కావొచ్చు
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. దీని వలన మన పనులు కూడా సులభంగా ఐపోతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు.. అలాగే మనకి తెలియని సమాచారం కూడా వెంటనే తెలుసుకోవచ్చు. ఇది లేకుండా బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. మనిషి సగం అవసరాలన్ని ఫోన్ మీదే ఆధారపడి ఉన్నాయి. మరి ఇంతలా మనకి సపోర్ట్ చేసే మనకి బాగా అవసరం ఉన్నప్పుడు ఫోన్ స్లో అయి సరిగా వర్క్ చేయకపోతే చిరాకుగా అనిపిస్తుంటుంది. ఇది అర్ధం కాక చాలా మంది ఫోన్లను విసిరి కొడుతుంటారు. సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ లేకపోయినా.. యాప్ లు ఎక్కువైనా ఉన్నా ఫోన్ హ్యాంగ్ అయి స్లో అయిపోతుంది. దీనికి గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
1. స్టోరేజ్ ఫుల్ అయితే ఫోన్ ఆటోమేటిక్ గా హ్యాంగ్ అవ్వొచ్చు.. కాబట్టి మీరు అవసరమైనవి తీసేస్తే మంచిది.
2. చాలా మంది అవసరం లేని మెసేజ్ లు, వీడియోలు , ఫోటోలు , యాప్ లు అదే పనిగా ఫోన్లో ఉంచుకుంటారు. కానీ, దీని వలన స్లో అవుతుంది.. కాబట్టి వీటిని డిలీట్ చేయండి.
3. యాప్ లు నిక్షిప్తం చేసుకునే క్యాచీ క్లియర్ చేస్తూ ఉండండి. సాఫ్ట్ వేర్ అప్డేట్ అప్పుడప్పుడు చేసుకుంటే ఫోన్ స్పీడ్ పెరిగి బాగా పని చేస్తుంది.
4. హోమ్ స్క్రీన్ పై ఉండే విడ్జెట్ లను తీసి, వైరస్ డిటెక్టింగ్ యాప్స్ ని వాడండి.
5. ఫోన్ హ్యాంగ్ అదే పనిగా అవుతున్నప్పుడు ఒకసారి రీ స్టార్ట్ చేస్తే అప్లికేషన్స్ అన్ని రీసెట్ అవుతాయి.