ఇది సైకిలా? బుల్డోజరా?

by Disha Web Desk 23 |
ఇది సైకిలా? బుల్డోజరా?
X

దిశ,వెబ్ డెస్క్: జర్మనీ కి చెందిన సెబాస్టియన్ అనే వ్యక్తి 2177కేజీల బరువు గల సైకిల్ ని తయారుచేశాడు. ఈ సైకిల్ ని తయారు చేయాటానికి 2500 గంటల సమయం పట్టింది. దీని పేరు క్లీన్ జోహాన్న. ఇటీవల జర్మనీలో నిర్వహించిన సైక్లింగ్ వరల్డ్ బైక్ షో లో ఈ సైకిల్ అందరినీ ఆకర్షించింది. దీనిని ఇనుము పరికరాల వ్యర్ధాలతో 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భారీ సైకిల్ ను రూపొందించారు. ముందు, వెనుక వైపు కలిసి రెండు భారీ టైర్లు, మధ్యలో ఒక మీడియం టైర్లనును అమర్చారు. ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాలి. ఇటువంటి వాహనాలను రోడ్డుపైకి తెచ్చి ఎక్కడికైనా ప్రయాణించటం అంటే అంత సులభమైన విషయం కాదు. కానీ ఈ సైకిల్‌ ని తయారు చేసిన సెబాస్టియన్ మాత్రం దీనిపై 389 కిలోమీటర్ల ప్రయాణించటానికి సిద్దంగా ఉన్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తొందరలోనే ఈ సైకిల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

Next Story

Most Viewed