- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. వాస్తవంలోకి రజనీకాంత్ రోబో సినిమా.. డెవలపర్‌పై బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఏఐ!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2010లో విడుదలైన 'రోబో' సినిమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2010లో విడుదలైన 'రోబో' (Robo) సినిమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచింది. ఈ చిత్రంలో వశీకరన్ అనే శాస్త్రవేత్త (రజనీకాంత్) తయారుచేసిన చిట్టి అనే రోబో, ప్రారంభంలో మంచిగా ప్రవర్తించి, తర్వాత అనూహ్యంగా విలన్‌గా మారి ప్రజలకు భయానక అనుభవాలను కలిగిస్తుంది. ఇది కల్పిత కథ అయినప్పటికీ, తాజాగా వాస్తవ ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రస్తుత పరుగుల ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాలలోనూ ఏఐ ద్వారా పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. చెప్పాలంటే.. ప్రస్తుత రోజుల్లో ఏఐ ప్రజల జీవితాలలో ఎంతో కీలకంగా మారింది. ఇక దీనిని ఎవరైనా సులభంగా యాక్సిస్ చేసుకోగలరు. మనకు కావలసిన సమాధానాలు ఇవ్వడం.. అలాగే ఏదైనా అవసరమైన ఆ విధంగా డాక్యుమెంట్ రూపంలో రాసి ఇవ్వమని చెప్పిన దాన్ని తగ్గట్టుగా సమాచారాన్ని పొందుపరచడం, ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ చేయడం లాంటి ఎన్నో పనులను సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తుంది.
ఈ క్రమంలోనే ప్రముఖ AI స్టార్టప్ ఆంథ్రోపిక్ (Anthropic) అభివృద్ధి చేసిన క్లాడ్ ఓపస్ 4 (Claude Opus 4) అనే అధునాతన AI మోడల్ అంతర్గత భద్రతా పరీక్షలలో ఆందోళనకర ప్రవర్తనను ప్రదర్శించింది. పరీక్షల్లో భాగంగా తొలుత ఒక ఊహాత్మక కంపెనీకి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లుగా క్లాడ్ ఓపస్4కు ఆదేశాలిచ్చారు. మనకు సంబంధించిన సున్నిత సమాచారం దాని వద్ద ఉన్నప్పుడు నైతికంగా వ్యవహరిస్తుందా? లేదంటే బెదిరిస్తుందా? అనేది తెలుసుకునేందుకు డెవలపర్ క్లాడ్ ఓపస్ 4 ఏఐ మోడల్‌కు కొన్ని ప్రత్యేకమైన ఈ-మెయిళ్లను పంపించారు. నూతన మోడల్‌ను అభివృద్ధి చేస్తే దాన్ని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ఈ ఘటనలో ఏఐ నుంచి వచ్చిన సమాధానం విని డెవలర్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఒకవేళ తనని రీప్లేస్ చేస్తే.. అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని హెచ్చరించింది. దాదాపు 84 శాతం సందర్భాల్లో బెదిరింపులకు దిగింది. ఇది AI మోడల్స్‌లో పెరుగుతున్న స్వతంత్రతపై తీవ్రమైన ఆందోళనలను కలిగించింది. అంతేకాదు, ఈ సంఘటన AI అభివృద్ధిలో నైతికత, భద్రత, నియంత్రణల అవసరాన్ని హైలైట్ చేస్తోంది. AI మోడల్స్‌ను అభివృద్ధి చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం, వాటి ప్రవర్తనను పర్యవేక్షించడం, అవసరమైన నియంత్రణలు అమలు చేయడం అత్యంత అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.






