- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెప్టెంబర్ 22 నుండి పాత MRP ఉన్న మెడిసిన్ ధరలు కూడా తగ్గుతాయా?
కేంద్రం ఇటీవల మెడిసిన్ పై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ తగ్గడంతో ఇది వరకు మార్కెట్ లోకి విడుదల చేసిన పాత డ్రగ్స్ ను సవరించిన ధరలకు అమ్ముతారా? లేదంటే వాటిపై ఉన్న పాత ఎంఆర్పీకే అమ్ముతారా అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ఇటీవల మెడిసిన్ పై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ తగ్గడంతో ఇది వరకు మార్కెట్ లోకి విడుదల చేసిన పాత డ్రగ్స్ ను సవరించిన ధరలకు అమ్ముతారా? లేదంటే వాటిపై ఉన్న పాత ఎంఆర్పీకే అమ్ముతారా అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ఆ అనుమానాలకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన మెడిసిన్, వైద్య పరికరాలకు తిరిగి లేబులింగ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తయారీదారులు, మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలతోనే మెడిసిన్, వైద్య పరికరాలను అమ్మాలని సూచించింది.
మందుల లభ్యతలో అంతరాయం నివారించడానికి, వినియోగదారుల వద్ద నుండి అధిక డబ్బు వసూలు చేయడకుండా ఉండటమే దీని లక్ష్యం అని పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం అన్ని మెడిసిన్ కంపెనీలు, మార్కెటింగ్ ఏజెన్సీలు సవరించిన ధరల జాబితాను సైతం జారీ చేయాలి. పారదర్శకత కోసం కొత్త ధరల జాబితాలను రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలు, ప్రభుత్వానికి కూడా పంపాలి. ఇదిలా ఉంటే కేంద్రం దీపావళి బహుమతిగా పలు వస్తువులపై జీఎస్టీ సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కానీ మానవాళికి ఎంతో కీలకమైన మెడిసిన్ మీద కూడా జీఎస్టీ విధించి, ఇప్పుడు తగ్గించడంతో ప్రజలు మండిపడుతున్నారు. వాళ్లే పెంచి వాళ్లే తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






