ఇండియన్ మార్కెట్‌లోకి iQOO 15 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇతర వివరాలు ఇవే!

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్న మొబైల్స్‌లో iQOO కూడా ఒకటి. దీంతో ఈ చైనీస్ మొబైల్స్ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ బ్రాండ్ నుండి ఇప్పటికే పలు మోడల్స్ విడుదలవ్వగా తాజాగా iQOO 15 సైతం లాంచ్ అయ్యింది.

ఇండియన్ మార్కెట్‌లోకి iQOO 15 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇతర వివరాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్న మొబైల్స్‌లో iQOO కూడా ఒకటి. దీంతో ఈ చైనీస్ మొబైల్స్ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ బ్రాండ్ నుండి ఇప్పటికే పలు మోడల్స్ విడుదలవ్వగా తాజాగా iQOO 15 సైతం లాంచ్ అయ్యింది. అయితే దీనిని చైనాలో లాంచ్ చేయగా ఇండియన్ మార్కెట్ లోకి సైతం త్వరలోనే రాబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా దీని ధర ఇదే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే... iQOO 15 డిస్ ప్లే 6.85 అంగుళాలు ఉంటుంది.

ఇది Samsung M14 8T LTPO AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. అదే విధంగా ఈ ఫోన్ Adreno 840 GPUతో కూడిన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ద్వారా పనిచేస్తుంది. ఇందులో iQOO Q3 గేమింగ్ చిప్ ఉండటం వల్ల వీడియో గేమ్స్ ఆడేవారికి ఇది మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కాబట్టి గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా OriginOs 6.0 ద్వారా పనిచేస్తుంది. దీని కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ ఇందులో ఉంది.

వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. అదే విధంగా ఇందులో 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో 100W వైర్డ్, 40W చార్జింగ్ సపోర్ట్ తో 7000mAh బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఫోన్ ధర విషయానికి వస్తే ఇండియాలో 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM వేరియంట్ ధర రూ.55వేల నుండి రూ.60వేల మధ్య ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.

Next Story