ఐక్యూ నుంచి కొత్త ఫోన్..7000mAH భారీ బ్యాటరీ, ధ‌ర ఎంతంటే

by velandi.Saikiran |   (  Updated:2025-11-26 17:58:01  IST  )

లాంచ్ అయిన iQOO 15 ఫోన్స్ ఫీచ‌ర్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే, 6.85 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే క‌లిగి ఉన్న ఈ ఫోన్‌,

ఐక్యూ నుంచి కొత్త ఫోన్..7000mAH భారీ బ్యాటరీ, ధ‌ర ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. జనాలు కూడా ఒక్కొక్కరు రెండు ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో, దానికి త‌గ్గ‌ట్టుగానే కంపెనీలు కూడా మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వివో అనుబంధ మొబైల్ తయారీ కంపెనీ ఐక్యూ ( iQOO) నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఐక్యూ 15 ( iQOO 15) పేరుతో ఈ కొత్త మొబైల్ ను తీసుకువచ్చింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గత నెలలోనే చైనా దేశంలో ఈ ఫోన్ లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు మన ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది ఈ ఫోన్.

మ‌రి ఇండియా తాజాగా లాంచ్ అయిన iQOO 15 ఫోన్స్ ఫీచ‌ర్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే, 6.85 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే క‌లిగి ఉన్న ఈ ఫోన్‌, 7000mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండ‌నుంది. 50 MP ప్ర‌ధాన కెమెరాతో ఈ iQOO 15 మార్కెట్ లోకి వ‌చ్చేసింది. సెల్ఫీల కోసం 32 MP కెమెరా అందిస్తున్నారు. ఇక ఈ ఐక్యూ 15 ఫోన్ కు 100W Wired, 40W వైర్ లెస్ ఛార్జ‌ర్ స‌పోర్ట్ చేయ‌నుంది. ఆన్ రైడ్ 16 ఆధారంగా ఈ ఫోన్ వ‌ర్క్ చేయ‌నుంది. iQOO 15లో 12GB + 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ఫోన్ ధ‌ర రూ. 72,999 ఫిక్స్ చేశారు. 16GB + 512GB వేరియంట్ ఫోన్ ధర రూ. 79,999గా ఫైన‌ల్ చేశారు. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసేట‌ప్పుడు క్రెడిట్, ఇత‌ర కార్డులు వాడితే, దాదాపు రూ.7 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భించ‌నుందట‌. iQOO 15 ఫోన్స్‌ డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి అమెజాన్‌ లో అందుబాటులోకి రానున్నాయి. iQOO 15 ఫోన్స్ రెండు కలర్స్ లో లభించనుంది.

Next Story