iPhone 17: యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన జనాలు

by velandi.Saikiran |   (  Updated:2025-09-19 06:17:27  IST  )

iPhone 17: యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన జనాలు
X

దిశ‌, వెబ్ డెస్క్ : యాపిల్‌ స్టోర్స్‌ ముందు జనాలు క్యూ కట్టారు. ఇవాళ్టి నుంచి భారత్‌ లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ రానుంది. దీంతో యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్స్‌ ముందు కస్టమర్లు పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు క‌ట్టారు. అంద‌రి కంటే ముందే కొనుగోలు చేయాల‌నే ఉద్దేశ్యంతో జ‌నాలు ఇలా ఎగ‌బ‌డుతున్నారు. ఈ త‌రుణంలోనే... భారీ క్యూ లైన్ల వీడియోలు వైర‌ల్ గా మారాయి.

గత ఆరు నెలలుగా ఈ ఐఫోన్ 17 సిరీస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని... అందుకే ఇలా క్యూలైన్ కడుతున్నట్లు కొంతమంది వినియోగదారులు కూడా పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా... ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్ మోడల్స్ తాజాగా తీసుకువచ్చింది ఆపిల్. అయితే ఈసారి 256 జీబీ మోడల్ లో ఐఫోన్ ను తీసుకు వచ్చింది కంపెనీ. దీంతో జనాలు ఎగ పడుతున్నారు. ఇక ఐఫోన్ 17 ధర రూ. 82,900గా ఉంది. అలాగే ఎయిర్ మోడల్ ధర 1.19 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఐఫోన్ 17 ప్రో 1.34 లక్షలు గా ఉంది. ప్రో మాక్స్ ధర 1.49 లక్షలు గా ఫైనల్ చేశారు. క్లిక్

Next Story