- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iPhone 17 Pro: ఈ ఐఫోన్ పై రూ. 53 వేల వరకు డిస్కౌంట్..!
ఐఫోన్ 17 ప్రో ధర రూ. 53,000 తగ్గింది. ఈ ఆఫర్ ఏప్రిల్ చివరి వరకు ఉండనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త అందింది. ఐఫోన్ 17 ప్రో ( iPhone 17 Pro) మొబైల్ పైన దాదాపు రూ. 53 వేల భారీ తగ్గింపును ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ నెల చివరి వరకు మాత్రమే ఉండనుంది. 128 జీబీ/256 జీబీ మోడల్ ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయినప్పుడు రూ.1.44 లక్షలుగా ఉంది. అయితే ఇప్పుడు రూ. 53 వేల డిస్కౌంట్ ఇస్తున్న నేపథ్యంలో ఈ ఐఫోన్ రూ.91,900 లకే అందుబాటులోకి వస్తుందన్నమాట. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ లలో ప్రస్తుతం గ్రాండ్ సమ్మర్ సేల్ నడుస్తోంది.
రూ. 53 వేల భారీ తగ్గింపు
ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే ఐ ఫోన్ 17 ప్రో పైన రూ. 53,000 వరకు డిస్కౌంట్ వస్తుందని న్యూస్ వైరల్ గా మారింది. ఈ కామర్స్ సైట్ల ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే, నేరుగా రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే HDFC లేదా ఐసీఐసీఐ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు ఇనిస్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద పాత ఐఫోన్ మార్పిడి చేసుకుంటే, రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు మరింత సేఫ్ కానున్నారు. ఇలా ఓవరాల్ గా రూ. 53,000 వరకు డిస్కౌంట్ లభించనుంది అన్నమాట.






