- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iphone 17: సూపర్ ఫీచర్స్‌తో ఐఫోన్ 17..లాంచ్ డేట్, ధర వివరాలు ఇవే!
ఐఫోన్ (I PHONE) అంటే మొబైల్ ప్రియులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త మోడల్ లాంచ్ అయ్యింది అంటే చాలు ఎంత రేటు ఉన్నా కొనేస్తారు. ఇక ప్రస్తుతం ఆపిల్ లవర్స్ ఐఫోన్

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ (IPHONE) అంటే మొబైల్ ప్రియులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త మోడల్ లాంచ్ అయ్యింది అంటే చాలు ఎంత రేటు ఉన్నా కొనేస్తారు. ఇక ప్రస్తుతం ఆపిల్ లవర్స్ ఐఫోన్ 17 (IPHONE 17) కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని నెలల్లోనే ఈ ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్‌లో డిస్‌ప్లే కాస్త పెద్దగా ఉండటంతో పాటూ కెమెరాలోనూ మార్పులు చేశారు. ఐఫోన్ 16ప్రో (IPHONE 16 PRO) మోడల్‌లో స్వల్ప మార్పులతో ఐఫోన్ 17ను డిజైన్ చేస్తున్నారు.
ఇందులో వర్టికల్ డ్యుయల్ కెమెరా రాబోతుంది. అంతే కాకుండా స్క్రీన్ పరిమాణమే 6.3 ఇంచులు ఉండనుంది. డిస్‌ప్లేలో యాంటీ రిఫ్లెక్టివ్ మరియు స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ ఉండేలా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరాను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు సమాచారం. 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్‌లో ఆపిల్ పరిచయం చేయనుంది. ఐఫోన్ 16లో కేవలం 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా మాత్రమే ఉండగా 17లో రెండింతలు కానుంది. బ్యాక్ కెమెరా విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు.
అంతే కాకుండా ఐఫోన్ 17 మూడు రంగుల్లో లాంచ్ కాబోతుందని నివేదికలు చెబుతున్నాయి. వైట్, బ్లాక్ మరియు పింక్ కలర్స్‌లో ఐఫోన్ 17 లాంచ్ కాబోతుందట. ఇక ఈ మోడల్‌ను ఆపిల్ 2025 సెప్టెంబర్ 11, 13 తేదీల మధ్య లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర అమెరికాలో 899 డాలర్లు, ఇండియాలో రూ. 89,900 ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరకు ఐఫోన్ 16 లాంచింగ్ ధరకు పెద్దగా తేడా ఏమీ ఉండదని తెలుస్తోంది.






