ఐఫోన్ 16 మొబైల్స్ పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్ళీ రాదు..!

by velandi.Saikiran |

మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... మార్కెట్లోకి రకరకాల ఫోన్స్ వస్తున్నాయి. తక్కువ ధరలో... మంచి ఫీచర్స్ ఉన్న

ఐఫోన్ 16 మొబైల్స్ పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్ళీ రాదు..!
X

దిశ, వెబ్ డెస్క్ : మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... మార్కెట్లోకి రకరకాల ఫోన్స్ వస్తున్నాయి. తక్కువ ధరలో... మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు కూడా మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో జనాలు ఒకటి కాదు రెండు మొబైల్స్ కొనుగోలు చేసి వాడుతున్నారు. ఒకటి ఆఫీస్ పర్పస్ అయితే మరొకటి పర్సనల్గా కూడా యూజ్ చేస్తున్నారు.

అయితే... ఈ మధ్య ఆఫీస్ బాయ్ కూడా ఐఫోన్ వాడేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఐఫోన్ 16 పైన ( iPhone 16) అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 16 ప్రో ( Iphone Pro), ఐఫోన్ 16 ప్రో మాక్స్ ( Iphone pro max) రెండు కూడా ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. మరి వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే... ఐఫోన్ 16 ప్రో 128 జీబీ వేరియంట్ మొబైల్ అసలు ధర 1,19,900 రూపాయల వరకు ఉంది. అయితే దీనిపై ఇప్పుడు ఎనిమిది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోన్... 1,09,900 రూపాయలకే మనకు అందుబాటులో ఉండబోతుంది. ఇక 256 జిబి వేరియంట్ మొబైల్ ఫోన్ 1,29,900 రూపాయలు ఉండగా డిస్కౌంట్ పోను...1,22,900 రూపాయలకే వస్తోంది.

అలాగే ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256 జీబీ.. మొబైల్ ఫోన్ ధర 1,44,900 రూపాయలు ఉండగా... డిస్కౌంట్ పోను 1,32,900 రూపాయలకు వస్తుంది. అలాగే 512 జీబీ ఉన్న మొబైల్... 1, 64,900 రూపాయల నుంచి... 1,57,900 రూపాయలకు తగ్గింది. 1TB వేరియంట్ మొబైల్ ఫోన్ లక్ష 84 వేల 900 రూపాయల నుంచి... 1,77,900 రూపాయలకు తగ్గింది. ఇక ఈ మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. క్రెడిట్ కార్డులు వాడితే దాదాపు 4 వేల వరకు డిస్కౌంట్ లభించే ఛాన్స్ ఉంది. ఈఎంఐ కాకపోతే మరో రెండు వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

Next Story