పెద్ద కెమెరాతో Infinix ‘Note 30 5G’ స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
పెద్ద కెమెరాతో Infinix ‘Note 30 5G’ స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ నుంచి త్వరలో ‘Note 30 5G’ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ జూన్ నెల మధ్యలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇంతకుముందు Infinix Note 30,Note 30 Pro వేరియంట్లు గ్లోబల్ మార్కెట్లో విడుదలవగా ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. Note 30 5G మీడియాటెక్ డైమన్సిటీ 6080 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది 6.78-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,460 పిక్సెల్‌లు) IPS LTPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 6GB, 8GB RAM 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. కెమెరా పరంగా ప్రధానంగా 108MP,8MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. ఫోన్‌లో 45W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.





Next Story

Most Viewed