ప్ర‌మాదంలో వోడాఫోన్‌..దూసుకెళుతున్న‌ జియో నెట్‌వర్క్‌!

by velandi.Saikiran |

జియో నెట్‌వర్క్ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రారంభంలో ఫ్రీ ఇంటర్నెట్, టాక్ టైం ఇచ్చి అందరిని ఆకట్టుకున్న జియో

ప్ర‌మాదంలో వోడాఫోన్‌..దూసుకెళుతున్న‌ జియో నెట్‌వర్క్‌!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన భారతదేశంలో జియో నెట్‌వర్క్ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రారంభంలో ఫ్రీ ఇంటర్నెట్, టాక్ టైం ఇచ్చి అందరిని ఆకట్టుకున్న జియో, ఆ తర్వాత ఛార్జీలు వసూలు చేసినప్పటికీ కస్టమర్లు అందరూ అందులోనే కొనసాగుతున్నారు. ఇతర నెట్‌వర్క్ లతో పోలిస్తే, జియోలో అన్ని సౌకర్యాలు, ఆఫ‌ర్లు ఉంటున్నాయని జ‌నాల న‌మ్మ‌కం. ముఖ్యంగా నెట్‌వర్క్ విషయంలో జియోను ఎక్కువగా జనాలు ఎంచుకుంటున్నారు. ఏ మూలకు వెళ్లినా సిగ్నల్ తప్పకుండా వస్తుంది. అందుకే సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ జియో జపం చేస్తున్నారు.

ఇక ఆ జియో నెట్‌వర్క్ ను తట్టుకునేందుకు ఎయిర్ టెల్‌, వోడాఫోన్ ఐడియా, అటు బీఎస్ఎన్ఎల్ చాలా కష్టపడాల్సి వస్తోంది. అయినప్పటికీ ఈ ఇతర నెట్‌వ‌ర్క్‌ నుంచి కస్టమర్లను తమ వైపునకు ప్రతినెల లాగేసుకుంటుంది జియో. ఇక తాజాగా అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో కూడా జియో ప్రభంజనం సృష్టించింది. ఈ ఒక్క నెలలో 1.99 మిలియన్స్ మొబైల్ యూజర్లను సంపాదించింది జియో. అంటే దాదాపుగా 19.97 లక్షల మంది కొత్తగా అక్టోబర్ మాసంలో జియోలోకి వ‌చ్చేశార‌న్న మాట‌. ఆ తర్వాత ఎయిర్ టెల్‌ 1.25 మిలియన్స్ తో దూసుకు వెళ్తోంది. అక్టోబర్ మాసంలో ఎయిర్ టెల్‌ కు 12.52 లక్షల కొత్త యూజర్లు తరలివచ్చారు. అటు BSNL కూడా మంచి పర్ఫామెన్స్ చూపిస్తోంది. అక్టోబర్ మాసంలో 2.69 లక్షల కొత్త యూజర్లను సంపాదించగలిగింది బీఎస్ఎన్ఎల్.

అయితే ఈ మూడింటి కంటే చిట్ట‌ చివరన వోడాఫోన్ ఐడియా ఉంది. అక్టోబర్ మాసంలో కొత్త యూజర్లను తెచ్చుకోవడం కాదు, ఉన్న యూజర్స్ ను కోల్పోయింది వోడాఫోన్ ఐడియా. ఈ అక్టోబర్ మాసంలో 20.83 లక్షల మందిని కోల్పోయిందని చెబుతున్నారు. వీళ్లంతా ఎక్కువ శాతం జియోకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఎయిర్ టెల్‌, కొంత మందిని ఆకర్షించగలిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇలా తమ యూజర్లను కోల్పోతే, వోడాఫోన్ ఐడియా కంపెనీ మరింత కష్టాల్లో పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. క్లిక్


Next Story