- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రన్ వే అవసరంలేని విమానం.. మద్రాస్ ఐఐటీ అద్భుత ఆవిష్కరణ
సాధారణంగా విమానం ల్యాండ్ అవ్వాలి అన్నా, టేకాఫ్ అవ్వాలి అన్నా రన్ వే తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఎంత దూరం వెళ్లినా విమానాలు తిరిగి విమానాశ్రయంలోనే ల్యాండ్ అవుతుంటాయి. దిగేందుకు రన్ వే ఉండాలి లేదంటే ఆ విమానం పని అంతే.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా విమానం ల్యాండ్ అవ్వాలి అన్నా, టేకాఫ్ అవ్వాలి అన్నా రన్ వే తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఎంత దూరం వెళ్లినా విమానాలు తిరిగి విమానాశ్రయంలోనే ల్యాండ్ అవుతుంటాయి. దిగేందుకు రన్ వే ఉండాలి లేదంటే ఆ విమానం పని అంతే. అయితే అసలు రన్ వే అవసరం లేకుండా ల్యాండ్ అయ్యే టెక్నాలజీని మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రన్ వే లేకుండా నెమ్మదిగా ఎలాంటి ప్రమాదం జరగకుండా దిగాలంటే హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్, వర్చువల్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో విమానం తయారు చేయాలని పరిశోధనల్లో తేలినట్టు చెబుతున్నారు. రన్ వే లేకుండా ల్యాండ్ అవ్వడంలో విమానం ఎంత నెమ్మదిగా, ఎంత సాఫ్ట్ గా దిగుతుంది అనేది చాలా అవసరమని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ తన ప్రయోగ వివరాలు ఓ అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించింది. ఈ సిస్టమ్ టెక్నికల్‌గా, కమర్షియల్‌గా ఉపయోగించగలిగితే ప్రపంచ వైమానిక రంగంలోనే గేమ్ ఛేంజర్‌గా మారుతుందని తెలిపింది. ప్రయోగం సక్సెస్ అయితే విమానాలను కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లోనూ సునాయాసంగా దింపవచ్చని స్పష్టం చేసింది.






