ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారా.. భారీ డిస్కౌంట్ లో వచ్చే ఈ కూలర్లను ట్రై చేయండి..

by Disha Web Desk 20 |
ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారా.. భారీ డిస్కౌంట్ లో వచ్చే ఈ కూలర్లను ట్రై చేయండి..
X

దిశ, ఫీచర్స్ : వేడి తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాడు. హోలీ తర్వాత భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రత మరింత వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో ప్రజలు ముందస్తుగానే తమ పాత ఏసీలు, కూలర్లను మరమ్మతు చేయడం ప్రారంభించేశారు. కొంత మంది కొత్త ఏసీ, కూలర్ లను కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఏసీ కొనే స్తోమత లేని వారు కూలర్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందే. మరి అతి తక్కువ ధరలోనే ACలాంటి చల్లదనాన్ని అందించే ఎయిర్ కూలర్‌ల గురించి ఏమేం ఉన్నాయో, వాటి ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

కూలర్ ధర కంటే ఎయిర్ కండిషనర్ ఖరీదు ఎక్కువ అని అందరికీ తెలుసు. ఎయిర్ కండిషనర్ నిర్వహణ కూలర్ కంటే ఎక్కువ. అలాగే ఏసీలు కూలర్ల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. ఈ కారణంగా చాలా మంది తమ బడ్జెట్‌ కు మించి ఉన్న ఏసీలను కొనుగోలో చేయకుండా కూలర్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఇ-కామర్స్ సైట్‌ల నుండి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Bajaj DMH 65 Neo 65L

బజాజా నుండి వచ్చిన ఈ కూలర్ డెజర్ట్ వేరియంట్‌లో వస్తుంది. దీనిలో మీరు 65 లీటర్ వాటర్ ట్యాంక్‌ని పొందవచ్చు. ఈ కూలర్‌లో టర్బో ఫ్యాన్ టెక్నాలజీ ఉంది. ఇది మండే వేడిలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది. బజాజ్ నుండి వచ్చిన ఈ ఎయిర్ కూలర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ హెక్సా కూల్ మేట్, 90 అడుగుల ఎయిర్ త్రో, 3 స్పీడ్ ఫ్యాన్ ఆప్షన్ ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్ DMH 65 Neo 65Lని 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,449కి కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ సైట్ నుండి ఈ కూలర్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీరు ఉచిత హోమ్ డెలివరీ, 1 సంవత్సరం వారంటీని పొందవచ్చు.

Symphony Siesta 95 XL Air Cooler

సింఫనీ కూలర్ సెగ్మెంట్‌లో బాగా తెలిసిన పేరు. సింఫనీ నుండి విడుదలైన ఈ కూలర్ అమెజాన్‌లో అసలు ధర రూ. 16,999 ఉండగా, 35 శాతం తగ్గింపుతో కేవలం రూ. 10,991కి కొనుగోలు చేయవచ్చు. సింఫనీకి చెందిన ఈ కూలర్‌లో 95 లీటర్ల వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. అంతేకాకుండా ఇది హనీ కోంబ్ ప్యాడ్, శక్తివంతమైన ఫ్యాన్‌తో వస్తుంది. ఈ కూలర్‌ని EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెల ఈఎంఐలో కేవలం రూ. 533 మాత్రమే చెల్లించాలి.

Crompton Ozone Desert Air Cooler

క్రాంప్టన్ ఎలక్ట్రికల్స్ లో మంచి పేరున్న బ్రాండ్. ఈ కూలర్‌ను అమెజాన్‌లో 45 శాతం తగ్గింపు ధరలో కేవలం రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు. క్రాంప్టన్ నుండి వచ్చిన ఈ కూలర్‌లో ఆటో ఫిల్, 4 వే ఎయిర్ త్రో, హై డెన్సిటీ హనీ కోంబ్ ప్యాడ్, 75 లీటర్ వాటర్ ట్యాంక్ ఉన్నాయి. మీరు EMI ద్వారా కూడా క్రాంప్టన్ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ కూలర్‌ను ఉచితంగా హోమ్ డెలివరీ చేయనున్నారు.

Candes 12L Portable Mini Air Cooler

Candes నుండి ఈ ఎయిర్ కూలర్ చాలా చౌకగా ఉంటుంది, మీరు దీన్ని అమెజాన్ నుంచి రూ. 3,749కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ కూలర్‌పై 46 శాతం తగ్గింపును పొందుతున్నారు. ఈ కూలర్‌లో మీరు 3 వే స్పీడ్ కంట్రోలర్, ఇన్వెంటర్ అనుకూలమైన ఎయిర్ కూల్ హనీ కోంబ్ ప్యాడ్ పొందుతారు. అలాగే, మీరు కంపెనీ నుండి ఈ కూలర్‌పై 1 సంవత్సరం వారంటీని పొందుతారు. కాండెస్ కూలర్‌లో రస్ట్ ఫ్రీ డ్యూరబుల్ బాడీ, ICE చాంబర్, డస్ట్ ఫిల్టర్, మల్టీ వే ఎయిర్ ఫ్లో ఆప్షన్ ఉన్నాయి. మీరు అమెజాన్ నుండి ఈ కూలర్‌ను కొనుగోలు చేస్తే, మీకు ఉచిత హోమ్ డెలివరీ లభిస్తుంది.



Next Story

Most Viewed