- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హగ్ వీడియో వైరల్.. సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆండీ బిరాన్
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన బ్రిటీష్ బ్యాండ్ కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ ఇప్పుడు ఓ కార్పొరేట్ కీలక వ్యక్తికి తీవ్ర పరిణామాలకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన బ్రిటీష్ బ్యాండ్ కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ ఇప్పుడు ఓ కార్పొరేట్ కీలక వ్యక్తికి తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ కాన్సర్ట్‌లో వెలుగు చూసిన ఓ వీడియో వైరల్ కావటంతో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఆస్ట్రానమర్ (Astronomer)’ సీఈఓ ఆండీ బిరాన్ (Andy Biron) తన పదవికి రాజీనామా చేయాల్సింది వచ్చింది.
బుధవారం గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో స్పాట్‌లైట్ కింద ఆండీ తన సహోద్యొగి అయినా క్రిస్టిన్ కాబోట్ (Christine Cabot) కలిసి కనిపించారు. ఒక్కరినొక్కరు అత్యంత సన్నిహితంగా ఉంటూ హగ్ చేసుకుంటూ ఉన్న ఈ సన్నివేశం కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై స్పందించిన కంపెనీ తక్షణం చర్యలు తీసుకుంది.
ఈ ఘటనను ఖండించిన ఆస్ట్రానమర్ సంస్థ, తన సోషల్ మీడియా ఖాతాలో ఆండీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, అతనితో కనిపించిన మహిళా ఉద్యోగి చీఫ్ పీపుల్ ఆఫీసర్ (CPO) కాదని స్పష్టీకరణ ఇచ్చింది. అయితే, ఆండీపై కంపెనీకి ఎదురైన విమర్శలు తీవ్రంగా ఉండటంతో, చివరికి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సంస్థ అధికారికంగా ఈ రాజీనామాను ధృవీకరించింది. 'మా సంస్థ నైతిక విలువలు, నాయకత్వ ప్రమాణాలపై కట్టుబడి ఉంటుంది. ఆ ప్రమాణాలను అతిక్రమించినందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని ప్రకటనలో పేర్కొంది.
ఆండీ బిరాన్ ఇప్పటికే మేగన్ కెర్రిగాన్‌ను వివాహం చేసుకోగా, క్రిస్టిన్ కాబోట్ ప్రైవేటీర్ రమ్ సీఈఓ ఆండ్రూ కాబోట్ భార్య. ఈ ఇద్దరూ హైప్రొఫైల్ వ్యక్తులు కావడంతో, వీరి సన్నిహితత అందరి దృష్టిలో పడింది. వీరిద్దరూ ఇప్పటికే వివాహితులుగా ఉన్న సందర్భంలో ఇలా కెమెరాకు చిక్కిపోవడం, వారి వ్యక్తిగత జీవితాలపైనా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ వ్యవహారంపై అంతర్గత విచారణను కొనసాగిస్తోంది.






