Honor launches MagicBook X 14 laptop in India

by Disha Web Desk 17 |
Honor launches MagicBook X 14 laptop in India
X

దిశ, వెబ్‌డెస్క్: Honor కంపెనీ ఇండియాలో కొత్తగా ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది. ఈ వేరియంట్ పేరు 'Honor MagicBook X 14'. దీనిలో లేటెస్ట్ సూపర్‌సైజ్డ్ కూలింగ్ సిస్టమ్ అమర్చబడి ఉంది. 8GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 45,990. అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 41,990కే ల్యాప్‌ట్యాప్ లభిస్తుంది. ఈ ఆఫర్ ధర జనవరి 20,2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది.



Honor MagicBook X 14 ల్యాప్‌ట్యాప్ 14-అంగుళాల ఐ కంఫర్ట్ ఫుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 84 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో TUV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, TUV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ 11వ జెన్ ఇంటెల్ కోర్ i5-1135G7 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 4.2Ghz టర్బో ఫ్రీక్వెన్సీతో పాటు Intel Iris XE గ్రాఫిక్స్‌‌ను కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లో 512GB PCIe NVMe SSDతో 8GB డ్యూయల్-ఛానల్ DDR4 RAMను అమర్చారు. windows 11 ద్వారా పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ 65W టైప్-సి చార్జింగ్‌‌తో 56W బ్యాటరీని కలిగి ఉంది. కేవలం ఒక గంటలో 68 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. 1.38 కిలోల బరువుతో 15.9mm మందంతో ఉంటుంది.

Next Story

Most Viewed