- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Honor నుంచి మ్యాజిక్‌బుక్ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లు లాంచ్
Honor కంపెనీ ఇటీవల భారత్‌లో రెండు మ్యాజిక్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. వీటి పేరు ‘Honor MagicBook X14 (2023), Honor MagicBook X16 (2023)’.

దిశ, వెబ్‌డెస్క్: Honor కంపెనీ ఇటీవల భారత్‌లో రెండు మ్యాజిక్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. వీటి పేరు ‘Honor MagicBook X14 (2023), Honor MagicBook X16 (2023)’. ఈ రెండు కూడా 12th Gen i5-12450H ప్రాసెసర్ ద్వారా పనిచేస్తాయి. Honor MagicBook X14 (2023) మోడల్ 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 48,990, 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 51,990. ఇది 88 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 14-అంగుళాల పూర్తి HD (1920x1080) IPS స్క్రీన్‌ను కలిగి ఉంది.
Honor MagicBook X16 (2023) మోడల్ ల్యాప్‌టాప్ 16-అంగుళాల పూర్తి HD (1920x1080) IPS డిస్‌ప్లేతో 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. దీని 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,990, 16GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 53,990. ల్యాప్‌టాప్‌లు 65W టైప్-సి ఫాస్ట్ చార్జర్ సపోర్ట్‌తో 60Whr బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ రెండు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు సమయంలో రూ. 2,500 వరకు తగ్గింపు కూడా ఉంది.






