ఐఫోన్‌లకు హ్యాకింగ్ ముప్పు.. యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్!

by Ajay Maddhiboyina |

సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతాయని చాలా మంది ఐఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. కానా తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT ఇండియాలో కొన్ని మిలియన్ల ఐఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఐఫోన్‌లకు హ్యాకింగ్ ముప్పు.. యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతాయని చాలా మంది ఐఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. కానా తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT ఇండియాలో కొన్ని మిలియన్ల ఐఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. CERT ప్రకారం ఐఫోన్లలో ఓ సెక్యురిటీ లోపాన్ని గుర్తించారు. ఈ సెక్యురిటీ లోపం హ్యాకర్లు ఐఫోన్ల నుండి మాత్రమే కాకుండా ఐప్యాడ్లు, మ్యాక్ బుక్‌ల నుండి సైతం సమాచారాన్ని చోరీ చేయవచ్చని పేర్కొంది.

యాపిక్ కు చెందిన కొన్ని వర్షన్ల మొబైల్స్ హ్యాకింగ్ కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. హ్యాకింగ్ కు గుర‌య్యే వాటిలో Apple iOS / iPadOS versions prior to 18.7.1, Apple iOS / iPadOS versions prior to 26.0.1,Apple macOS Tahoe versions prior to 26.0.1, Apple macOS Sonoma versions prior to 14.8.1, Apple macOS Sequoia versions prior to 15.7.1 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ఉన్నాయి.

ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ మొబైల్స్ లేదా డివైజ్ లు ఉప‌యోగిస్తున్న సంస్థ‌లు లేదా వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఒక‌వేళ ఫోన్ హ్యాక్ అయితే యాప్స్ క్రాష్ అవ్వ‌డం, ఫోన్ సిగ్న‌ల్ అంద‌క‌పోవ‌డం, ఫోన్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటివి జ‌రుగుతాయ‌ని హెచ్చ‌రించింది. ఈ హ్యాకింగ్ ముప్పు నుండి బ‌య‌ట‌ప‌డాలి అంటే యూజ‌ర్లు ఫోన్ల‌ను అప్డేట్ చేసుకోవాల‌ని CERT సూచిస్తోంది. ముఖ్యంగా పాత ఓఎస్ వ‌ర్ష‌న్లు ఉప‌యోగిస్తున్న‌వారు అప్డేట్ చేసుకోవాల‌ని, లేదంటే ఆటోమేటిక్ అప్డేట్ ఆనే ఆప్ష‌న్ ఆన్ చేసి పెట్టుకోవాల‌ని సూచించింది.

Next Story