‘అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దు’ ఉద్యోగులకు గూగుల్ హెచ్చరికలు

by Ramesh Naini |

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేసింది.

‘అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దు’ ఉద్యోగులకు గూగుల్ హెచ్చరికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google employees) తన ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ నేపథ్యంలో, అమెరికాను వీడి బయటకు ప్రయాణించవద్దని గూగుల్ ఉద్యోగులకు స్పష్టమైన అడ్వైజరీ ఇచ్చింది. కొత్త విధానాల కారణంగా వీసా అపాయింట్‌మెంట్లు భారీగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే 2026 అక్టోబర్ నెలాఖరు వరకు అపాయింట్‌మెంట్లు లభించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి బయటకు వెళ్తే తిరిగి రావడానికి వీసా ప్రాసెస్ పూర్తవ్వడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది.

ఈ పరిస్థితులు ఉద్యోగుల పని, ప్రాజెక్టులు, వ్యక్తిగత భద్రతపై ప్రభావం చూపవచ్చని గూగుల్ పేర్కొంది. అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ సంస్థ ఈమెయిల్ ద్వారా అధికారికంగా సమాచారం అందించినట్లు సమాచారం. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పుల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికమేనని, పరిస్థితులు మెరుగుపడితే తదుపరి సూచనలు ఇస్తామని గూగుల్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

Next Story