- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google Logo : 10 ఏళ్ల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు!
ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ తన ఐకానిక్ లోగోను పునరుద్ధరిస్తోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్ ఇంజన్ దిగ్గజం (Google) గూగుల్ కంపెనీ తన ఐకానిక్ లోగో (logo)ను పునరుద్ధరిస్తోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత తన 'G' చిహ్నంలో స్వల్ప అప్డేట్ తీసుకొచ్చింది. గూగుల్ చిహ్నంలో 4 రంగులు అయిన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులు విడివిడిగా కనిపించేవి, కానీ స్వల్ప మార్పులు చేసిన తర్వాత ఈ రంగులు ఒకదానికొకటి కలిసి పోయేలా చిహ్నాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ చివరిసారిగా తన బ్రాండింగ్‌ను 2015లో మార్చింది. తాజాగా ఏఐ టెక్నాలజీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా ఈ మార్పు తెచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇందుకు సంబంధించిన లోగో ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే లోగోలో మార్పు గురించి గూగుల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ డిజైన్ రాబోయే కొన్ని రోజుల్లో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కనిపించడం ప్రారంభం అవుతోందని అంతర్జాతీయ వార్తలు నివేదిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ కంపెనీ Chrome, Maps, Gmail, Drive వంటి ఇతర ఉత్పత్తి లోగోలు కూడా మార్పులు వస్తాయా లేదా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.






