- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 18నెలల పాటు ఆ సేవలు ఫ్రీ
జియో తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో గూగుల్ భాగస్వామ్యంతో ఉచితంగా 18 నెలల పాటు రూ.35వేలు విలువ చేసే గూగుల్ ఏఐ ప్రో సేవలను అందించనుంది. ఈ ప్లాన్ లో జెమిని 2.5 ప్రో, ఇమేజ్ వీడియో క్రియేషన్ టూల్స్, నోట్ బుక్ LM మరియు 2TB క్లౌడ్ స్టోరేజ్ లభించనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జియో తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఉచితంగా 18 నెలల పాటు రూ.35వేలు విలువ చేసే గూగుల్ ఏఐ ప్రో సేవలను అందించనుంది. ఈ ప్లాన్ లో జెమిని 2.5 ప్రో, ఇమేజ్ వీడియో క్రియేషన్ టూల్స్, నోట్ బుక్ LM మరియు 2TB క్లౌడ్ స్టోరేజ్ లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్ లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మొదట ఈ ప్లాన్ కేవలం 18 నుండి 25ఏళ్ల మధ్య గల జియో 5జీ యూజర్లకు అందించనున్నారు.
తరవాత దీనిని విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారతీలు అందరికీ ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చినట్టు జియో, గూగుల్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇతర నెట్ వర్క్ ల కంటే జియో యూజర్లే ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతిరోజూ 1 జీబీ డేటాతో జియో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు ఉచితంగా ఏఐ ప్లాన్ తీసుకురావడంతో భారత్ ఏఐ వినియోగంలోనూ అగ్రదేశాలతో పోటీపడే అవకాశం ఉంది.






