వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అద్భుతమైన ఫీచర్

by Yella Dhawani Reddy |

స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అద్భుతమైన ఫీచర్
X

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ (Smartphone) వినియోగించే ప్రతి ఒక్కరూ దాదాపు వాట్సాప్ (Whatsapp) ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ కూడా తన యూజర్లకు ఎప్పటికప్పుడు మెరుగైనా అనుభవాన్ని అందించడానికి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ విండోస్ (Whatsapp Windows) యాప్‌కి ఛానెల్స్, కమ్యూనిటీస్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఈ సౌకర్యాలు మొబైల్, మ్యాక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి.

ఈ ఫీచర్ వల్ల మొబైల్ యాప్‌లో ఫాల్లో అయ్యే ఛానల్స్ ఇకపై విండోస్ యాప్‌లో కూడా కనిపిస్తాయి. అదేవిధంగా విండోస్‌లో ఒక ఛానెల్‌ని అనుసరిస్తే అది మొబైల్ యాప్‌లో కూడా కనిపిస్తుంది. అలాగే, ఇప్పుడు విండోస్ యాప్ పక్కన కమ్యూనిటీల ప్రత్యేక విభాగాన్ని చేర్చింది. దీంతో అన్ని కమ్యూనిటీలను సులభంగా వీక్షించవచ్చు. అలాగే నిర్వహించవచ్చు. యాక్టివ్‌గా ఉండే గ్రూపులను కూడా ప్రత్యేక పద్ధతిలో హైలైట్ చేస్తుంది. అయితే, ఈ కొత్త అప్‌డేట్ విండోస్ వెర్షన్ 2.2520.1.0 కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రాబోయే వారాల్లో మిగతా వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.

Next Story