తక్కువ ధరలో మరో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!

by Disha Web Desk 17 |
తక్కువ ధరలో మరో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మర్కెట్లోకి స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ Gizmore ఒక కొత్త మోడల్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ‘గిజ్మోర్ వోగ్’(Gizmore Vogue). స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.2,499. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ. 1,999 ప్రారంభ ధరతో అందిస్తోంది. మార్చి 20 నుండి ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో వివిధ బ్యాంకు కార్డులపై మరింత తక్కువ ధరకు వాచ్ లభించనుంది.


గిజ్మోర్ వోగ్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్

వాచ్ 1.95 అంగుళాల HD డిస్‌ప్లే, 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, ప్రీమియం మెటల్ కేసింగ్, స్క్వేర్ డయల్ ఉన్నాయి. నావిగేషన్‌ సపోర్ట్(GPS ట్రాకింగ్), 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, వాచ్‌లో రొటేటింగ్ డయల్, రీసెంట్ యాప్ బటన్ కూడా ఉన్నాయి, ఇది వినియోగదారులు చివరిగా ఓపెన్ చేసిన అప్లికేషన్‌ను ఫాస్ట్‌గా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

వినియోగదారుల హెల్త్‌కు సంబంధించి హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ మ్యాపింగ్, నిద్ర, రుతుచక్రం ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే, బ్లూటూత్ 5.1కి సపోర్ట్, బ్లూటూత్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే పది రోజుల వరకు, బ్లూటూత్ కాలింగ్‌తో 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది వైర్‌లెస్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. నీరు, ధూళి నిరోధకత కోసం IP67 రేట్ చేయబడింది.

ఇవి కూడా చదవండి : గర్భం దాల్చిన మహిళ.. ముందే అలర్ట్ చేసిన వాచ్‌!





Next Story

Most Viewed