ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు

by velandi.Saikiran |

ఐక్యూ 15 అపెక్స్ కూడా ఉంది. ఈ మొబైల్ ఇవాళ ఉదయమే ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ ద్వారా రూ. 72, 999 నుంచి ప్రారంభం కానుంది.

ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో చాలా రకాల మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఇందులో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర ఉండే మొబైల్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుగోలు చేసేలా ఫోన్స్ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఏప్రిల్ మాసంలో మార్కెట్ లోకి వచ్చే ఫోన్స్ వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఏప్రిల్ మాసంలో మార్కెట్ లోకి వచ్చే ఫోన్స్

ఇందులో ఐక్యూ 15 అపెక్స్ కూడా ఉంది. ఈ మొబైల్ ఇవాళ ఉదయమే ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ ద్వారా రూ. 72, 999 నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు రియల్ మీ 16 5జీ ఫోన్ కూడా రాబోతోంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. దీని ధర 18 వేల నుంచి 20వేల మధ్య ఉండనుంది. ఈ ఫోన్ లో మూడు వేరియంట్స్ కూడా ఉంటాయి. ఇక రేపు వివో 70 FE మోడల్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఫోను 7000mah బ్యాటరీ తో రానుంది. ఈ ఫోన్ ధర 30 వేల పైన ఉండనుంది. ఇక రియల్ మీ నోట్ 15 SE 5జి మొబైల్ కూడా రేపు లాంచ్ కానుంది. దీని ధర 20వేల రూపాయల వరకు ఉంటుంది.

Next Story