వాట్సప్‌ స్టేటస్‌‌లో మరో నాలుగు కొత్త ఫీచర్లు..!

by Yella Dhawani Reddy |

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) ఎప్పటికప్పుడూ తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటోంది.

వాట్సప్‌ స్టేటస్‌‌లో మరో నాలుగు కొత్త ఫీచర్లు..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) ఎప్పటికప్పుడూ తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా యూజర్లను ఆశ్చర్యపరిచే విధంగా నాలుగు సరికొత్త స్టేటస్‌ ఫీచర్లను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే స్టేటస్‌లో పాటలు జోడించడం, నచ్చిన వ్యక్తులను మెన్షన్‌ చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ మెసేజింగ్‌ దిగ్గజం, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని మెటా (Meta) తాజాగా విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

ఈ ఫీచర్ల ద్వారా ఇకపై మీ ఫొటోలతో ప్రత్యేకమైన కొల్లేజ్‌ (collage)ను సృష్టించే సౌకర్యాన్ని అందిస్తోంది. దీంతో స్టేటస్‌లోనే గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని, అందమైన లేఅవుట్‌ రూపంలో కొల్లేజ్‌ చేయవచ్చు. అంతేకాదు ప్రత్యేక ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ ద్వారా స్టైలిష్‌గా ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇది స్టేటస్‌లకు కొత్తదనాన్ని, క్రియేటివిటీని తీసుకురాబోతుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల మాదిరిగానే.. వాట్సప్‌ స్టేటస్‌లకు మ్యూజిక్‌ యాడ్‌ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మోర్‌ విత్‌ మ్యూజిక్‌ ఫీచర్‌తో యూజర్లు ఒక పాటను నేరుగా వారి స్టేటస్‌గా పోస్ట్‌ చేయొచ్చు.

వాట్సప్‌ తీసుకురానున్న కొత్త ఫీచర్‌ సాయంతో ఫొటోను స్టిక్కర్‌గా మార్చేసి స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. ప్రత్యేక ఎడిటింగ్‌ టూల్స్‌ ద్వారా దీనిని మీకు నచ్చిన ఫొటోలను నచ్చిన విధంగా మలచుకోవచ్చు. ఇదొక ఫన్‌ అండ్‌ క్రియేటివ్‌ ఫీచర్‌! అలాగే, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉపయోగించే యాడ్‌ యువర్స్‌ ఫీచర్‌ ఇప్పుడు వాట్సప్‌లోకి రాబోతోంది. ఈ ఇంటరాక్టివ్‌ టూల్‌ సహాయంతో మీరు పెట్టే స్టేటస్‌కు మీ ఫ్రెండ్స్‌ స్పందించేందుకు అవకాశముంటుంది. ఈ నాలుగు ఫీచర్లు వాట్సప్‌ స్టేటస్‌ అనుభూతిని పూర్తిగా మార్చివేస్తున్నాయనే చెప్పాలి. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ అప్‌డేట్స్‌ యూజర్లకు మరింత స్వేచ్ఛ, సృజనాత్మకత, ఆనందాన్ని అందించనున్నాయి.

Next Story