- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Guaranteed Exchange Value: Flipkart అదిరే ఆఫర్.. పాత ఫోన్ పెట్టు కొత్త ఫోన్ పట్టు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు తమ్ముళ్లూ
Guaranteed Exchange Value: కొత్త స్మార్ట్ ఫోన్ (Smart phone)కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అదిరిపోయే న్యూస్.

దిశ, వెబ్‌డెస్క్: Guaranteed Exchange Value: కొత్త స్మార్ట్ ఫోన్ (Smart phone)కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అదిరిపోయే న్యూస్. నథింగ్(Nothing Phone ) లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అమ్మకం త్వరలోనే ఫ్లిప్ కార్ట్ లో షురూ కానుంది. నథింగ్ ఫోన్ (Nothing Phone 3a)3a అమ్మకం మార్చి 11న, ఫోన్ 3a ప్రో అమ్మకం మార్చి 15న జరగనున్నాయి. ఈ రెండు ఫోన్‌ల మొదటి అమ్మకంపై కంపెనీ ప్రత్యేక హామీ ఎక్స్ఛేంజ్(Guaranteed Exchange Value) అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. డోంట్ మిస్ ఇట్.
నథింగ్ ఫోన్ 3a సిరీస్(Nothing Phone 3a series) ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా, కంపెనీ ప్రత్యేక హామీ కలిగిన ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తోంది. నథింగ్ ఫోన్(Nothing Phone 3a) 3ఎ లేదా ఫోన్ 3ఎ ప్రో స్మార్ట్‌ఫోన్(Smart phone) మొదటి సేల్‌లో కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే పూర్తి విలువను అందిస్తారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు నథింగ్స్ కొత్త స్మార్ట్‌ఫోన్(Smart phone)ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలసుకుందాం.
నథింగ్స్ స్పెషల్ గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ ఆఫర్:
గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ (Guaranteed Exchange Value)ఆఫర్ 2021.. ఆ తర్వాత లాంచ్ చేసిన OnePlus, Samsung, Nothing వంటి అన్ని బ్రాండ్‌ల నుండి Android స్మార్ట్‌ఫోన్‌లను కవర్ చేస్తుంది. iOS పరికరాలకు ఈ గడువు 2019 వరకు ఉంది. ఈ నథింగ్ ఆఫర్ మొదటి అమ్మకంలో మాత్రమే వర్తిస్తుంది. నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ మొదటి అమ్మకం మార్చి 11న జరగనుంది. అదే సమయంలో, నథింగ్ ఫోన్ 3a ప్రో మొదటి అమ్మకం మార్చి 15న ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ పొందాలంటే కస్టమర్లకు కొన్ని విషయాలు తెలుకుని ఉండాలి. అవేంటంటే?
-ముందుగా, కస్టమర్లు డెలివరీ చిరునామా లేదా పిన్ కోడ్‌ను నమోదు చేయాలి.
-ఇప్పుడు 'ఎక్స్ఛేంజ్ తో కొనండి' ఎంచుకోవడం ద్వారా, మీరు ఎక్స్ఛేంజ్ డివైజును ఎంచుకోవాలి.
-పరికర వివరాలు పంచుకున్న వెంటనే ఎక్చేంజ్ ప్రైస్ వర్తిస్తుంది.
-మీరు స్క్రీన్‌పై సూచనలను అనుసరించడం ద్వారా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి.
అయితే డెలివరీ సమయంలో పాత స్మార్ట్‌ఫోన్‌ల ధరను అంచనా వేయబోమని ఫ్లిప్‌కార్ట్ ధృవీకరించింది. అయితే, డెలివరీ ఏజెంట్ డయాగ్నస్టిక్ యాప్ సహాయంతో ఫోన్ బ్రాండ్, మోడల్‌ను చెక్ చేస్తారు.
నథింగ్ ఫోన్ 3ఎ ప్రో ధర:
8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 29,999 ఉండగా..8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 31,999. 12GB RAM + 256GB స్టోరేజ్: రూ. 33,999
ఫోన్ 3a ధర ప్రకటించలేదు 8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 24,999, 8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 26,999గా పేర్కొంది. నథింగ్ ఫోన్ 3A సిరీస్ పరిచయ ఆఫర్ల గురించి చూస్తే.. కంపెనీ రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనితో పాటు, కంపెనీ మొదటి అమ్మకంలో రూ. 3000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.






