- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు అంబానీ శుభవార్త..తక్కువ ధరలో Jio ఇన్వర్టర్
జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టం, సోలార్ ప్యానల్ సొల్యూషన్స్ పేరుతో కొత్తగా జియో ఇన్వర్టర్లు రాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రిలయన్స్ జియో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముందుగా ఉచితం పేరుతో జనాల్లోకి వచ్చిన రిలయన్స్ జియో... క్రమక్రమంగా ధరలను పెంచుకుంటూ వెళ్ళింది. అయినప్పటికీ మిగతా న నెట్వర్క్స్ కంటే రిలయన్స్ జియో నాణ్యమైన సేవలను అందిస్తోంది. దీంతో వినియోగదారులు మాత్రం జియో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఇప్పటికి కూడా ముఖేష్ అంబానీకి చెందిన ఈ రిలయన్స్ జియో దూసుకు వెళ్తోంది. అయితే ఈ రిలయన్స్ జియో తాజాగా గృహ విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రోడక్ట్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోందట.
తక్కువ ధరలో జియో ఇన్వర్టర్
జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టం, సోలార్ ప్యానల్ సొల్యూషన్స్ పేరుతో కొత్తగా జియో ఇన్వర్టర్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. సామాన్యులు కూడా కొనుగోలు చేసే దిశగా రిలయన్స్ జియో రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి గృహ వినియోగదారులకు విద్యుత్ చాలా అవసరం. ఈ మధ్య కాలంలో కరెంటు కోతలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఎండాకాలం వస్తే కరెంటు కోతల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వర్టర్ల కోసం కొంత మంది చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లను టార్గెట్ చేసేందుకు రిలయన్స్ జియో స్మార్ట్ ఇన్వర్టర్ లను తీసుకురాబోతుందట. బయట లభించే ఇతర కంపెనీలకు సంబంధించిన ఇన్వర్టర్ల ధర దాదాపు 20 వేల రూపాయల వరకు ఉంటాయి.
అయితే దాని కంటే తక్కువ ధరలో సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా రిలయన్స్ జియో నుంచి స్మార్ట్ ఇన్వర్టర్లు రాబోతున్నాయట. వీటి ధర 5000 రూపాయల నుంచి 9000 రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇన్వర్టర్లు 24 గంటల పాటు వినియోగించుకునేలా రూపొందిస్తున్నారట. త్వరలోనే ఎండాకాలం రాబోతున్న నేపథ్యంలో వీటిని తీసుకువచ్చేందుకు అంబానీ కృషి చేస్తున్నారట. ఒకవేళ ఈ ఇన్వర్టర్లు మార్కెట్లోకి లాంచ్ అయితే పండగే అంటున్నారు సామాన్యులు. ప్రతి ఒక్కరు కూడా వీటిని కొనుగోలు చేసే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.






