- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు.. వీడియో వైరల్
బెంగుళూరులో స్వదేశీ డ్రైవర్ లెస్ కారును రూపొందించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఆర్‌వీ కాలేజీ ఆధ్వర్యంలో దీనిని తయారు చేశారు. దాదాపు ఆరేళ్ల శ్రమతో ఏఐ, ఎంఎల్, 5జీ ఆధారంగా ఈ కారును రూపొందించారు.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో స్వదేశీ డ్రైవర్ లెస్ కారును రూపొందించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఆర్‌వీ కాలేజీ ఆధ్వర్యంలో దీనిని తయారు చేశారు. దాదాపు ఆరేళ్ల శ్రమతో ఏఐ, ఎంఎల్, 5జీ ఆధారంగా ఈ కారును రూపొందించారు. 2019లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రొఫెసర్లు ఉత్తర కుమారి, రాజా విద్య ఆధ్వర్యంలో ప్రయోగాలు జరిగాయి. భారత్ నుండి పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఆధారంగా నడిచేలా రూపొందిస్తున్న ఈ కారు ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని తెలుస్తోంది.
భారతీయ రహదారి పరిస్థితులను మ్యాపింగ్ చేసి దీనిని రోడ్డుపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కారు టెస్డ్ డ్రైవ్ సందర్భంగా ఉత్తరాధి మఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ కారులో కొంతదూరం ప్రయాణించారు. ప్రస్తుతం కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే విదేశాల్లో డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ సైతం ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయితే టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది.






