OnePlus 13పై రూ.4000 డిస్కౌంట్.. ఈ ధమాకా ఆఫర్ ఎక్కడంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-04 07:13:02  IST  )

ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon grate indian festival sale 2025) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. రెడ్ మీ, సామ్ సంగ్, ఆపిల్ ఇలా ప్రతి బ్రాండ్ లోనూ ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి.

OnePlus 13పై రూ.4000 డిస్కౌంట్.. ఈ ధమాకా ఆఫర్ ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon grate indian festival sale 2025) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. రెడ్ మీ, సామ్ సంగ్, ఆపిల్ ఇలా ప్రతి బ్రాండ్ లోనూ ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ 13 (OnePlus 13)పై సైతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు. వన్ ప్లస్ 13 లాంచింగ్ ధర రూ. 69,999 కాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దీని ధర రూ.63,999గా ఉంది.

అయితే ఇప్పుడు అదనంగా పలు క్రెడిట్ కార్డులు ఉపయోగించి మరో రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ.70వేల ఫోన్ ఇప్పుడు రూ.60వేల రూపాయలకే లభిస్తుంది. దాదాపు రూ.10వేల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. మూడు వేరు వేరు రంగులలో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. మిడ్ నైట్ ఓషన్, ఆర్కిటిక్ డాన్ మరియు బ్లాక్ ఎక్లిప్స్ రంగుల్లో ఉంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.82 అంగుళాల LTPO 4.1 AMOLED డిస్ ప్లే ఉంది.

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. అంతే కాకుండా ఇందులో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగాపిక్సల్ ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. దీంతో పాటు బెస్ట్ సెల్ఫీలకోసం 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా సైతం ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 6000mAh బ్యాటరీ ఉంది.

Next Story