- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Credit cards: పెరుగుతున్న క్రెడిట్ కార్డు మోసాలు..ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి
క్రెడిట్ కార్డులు వాడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సిబిల్ స్కోర్ ఉంటే చాలు వెంటపడి మరీ బ్యాంకులు క్రెడిట్ కార్డులను కట్టబెడుతున్నాయి. ఇక ఆర్థిక అవసరాలు ఉండటంతో జనాలు కూడా వాటిని తీసుకుని తెగ వాడేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: క్రెడిట్ కార్డులు వాడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సిబిల్ స్కోర్ ఉంటే చాలు వెంటపడి మరీ బ్యాంకులు క్రెడిట్ కార్డులను కట్టబెడుతున్నాయి. ఇక ఆర్థిక అవసరాలు ఉండటంతో జనాలు కూడా వాటిని తీసుకుని తెగ వాడేస్తున్నారు. ఆ తరవాత బిల్లు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు క్రెడిట్ కార్డు మోసాలు సైతం పెరిగిపోయాయి. ఆఫర్ల పేరుతో, URL లను పంపి ఇలా అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.
అయితే అలా మోసపోవద్దు అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సోషల్ మీడియాలో వచ్చే క్రెడిట్ కార్డు ఆఫర్లను గుడ్డిగా నమ్మకూడదు. అవి అఫీషియల్ వెబ్ సైట్ నుండి వచ్చాయా లేదంటే ఫేక్ వెబ్ సైట్ల నుండి వచ్చాయా అనేది నిర్ధారించుకోవాలి. URLపంపి క్లిక్ చేయాలని కోరినట్లతే అది క్రెడిట్ కార్డు కంపెనీకి చెందినదేనా లేదా అని నిర్దారించుకోవాలి.
ఏదైనా సమాచారం ఆ వెబ్ సైట్ కు ఇచ్చే ముందు అవసరమైతే మీ ఏజెంట్ కు కాల్ చేయాలి. అంతే కాకుండా తెలియని యాప్స్ కూడా డౌన్ లోడ్ చేయకూడదు. అధికారిక బ్యాంక్ యాప్స్ మాత్రమే వినియోగించాలి. అందులో మాత్రమే మీ కార్డ్ డీటేయిల్స్ నమోదు చేయాలి. దీంతో పాటు యాప్ పర్మిషన్స్ కూడా పరిమితంగా ఉంచాలి. ఏ యాప్ ఇన్ స్టాల్ చేసినా పూర్తి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఫోన్ గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వకూడదు.






