- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానో బనానా త్రీడీ ఇమేజెస్ కావాలా? AI ఉపయోగించి ఇలా పొందండి!
ఏఐతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఓ ఏఐ టూల్ గిబ్లి ఇమేజెస్ తయారు చేసి ఇవ్వగా ఇప్పుడు నానో బనానా త్రిడీ ఇమేజెస్ (Gemini nana banana 3d art) ట్రెండింగ్‌లో ఉంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు యువత నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడీ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏఐతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఓ ఏఐ టూల్ గిబ్లి ఇమేజెస్ తయారు చేసి ఇవ్వగా ఇప్పుడు నానో బనానా త్రిడీ ఇమేజెస్ (Gemini nana banana 3d art) ట్రెండింగ్‌లో ఉంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు యువత నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడీ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. చిటికెలో ఏఐ సహాయంతో తమ త్రిడీ ఇమేజెస్‌ను ఎంతో అందంగా పొందుతున్నారు. కాబట్టి ఈ ఇమేజెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం.. నానో బనానా ఏఐ ఇమేజ్లను ఉచితంగా పొందవచ్చు. కానీ ప్రీమియం చెల్లించినవారికి అపరిమిత ప్రాంప్ట్ లతో పాటు అపరిమిత ఇమేజెస్ వస్తాయి.
ఇక ఇమేజ్ క్రియేట్ చేసేందుకు ముందుగా జెమిని యాప్ (gemini ai) కానీ లేదా గూగుల్ ఏఐ స్టూడియో వెబ్ సైట్ కానీ ఓపెన్ చేయాలి. తరవాత మీకు ఎడమవైపు ఇమేజ్ అప్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్ లోడ్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఎడిట్ చేయాలనుకునే ఇమేజ్ అప్లోడ్ చేయాలి. తరవాత దాని పక్కన ఉన్న టూల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో బనానా సింబల్‌తో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోండి. తరవాత మీకు ఎంత సైజులో ఇమేజ్ కావాలో చెబుతూ ప్రాంప్ట్ ఇవ్వాలి.
ప్రస్తుతం ఎక్కువ ట్రెండ్ అవుతున్న డెస్క్ టాప్ పక్కన త్రిడీ బొమ్మ కోసం... చూడ్డానికి అచ్చం నిజమైన వ్యక్తిలా కనిపించే, సహజ వాతావరణం ఉండాలి. ఆ బొమ్మ కంప్యూటర్ డెస్క్ టాప్ పక్కన ఉండాలి. బొమ్మకి కింద ఒక ట్రాన్స్పరెంట్ బేస్ కూడా ఉండాలి. దానిపై ఎలాంటి టెక్స్ట్ ఉండకూడదు. అదే బొమ్మ కంప్యూటర్ స్క్రీన్ పై 3డీ మోడలింగ్ ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉన్నట్టు కనిపించాలి. కంప్యూటర్ పక్కన ఒక ప్యాకేజింగ్ బాక్స్ ఉండి దానిపై కూడా త్రిడీ ఇమేజ్ ఫోటో ఉండాలి. అది ఒక గిఫ్ట్ బాక్స్ లా కనిపించాలి. ఇలా ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ చేయాలి. సెకన్లు లేదా నిమిషంలో మీరు కోరుకున్నట్టుగా ఇమేజ్ సిద్ధమవుతుంది. అంతే తరవాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.






