- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AMCA: దెబ్బ అదుర్స్ కదా.. చైనా, పాక్ కు ఇండియా చెక్..మేడిన్ ఇండియా టెక్ తో యుద్ధ విమానం..ఫీచర్స్ ఇవే..!!
AMCA: భారత్ ప్రస్తుతం రక్షణ రంగంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధం అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : AMCA: భారత్ ప్రస్తుతం రక్షణ రంగంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా 5వ తరం జనరేషన్ యుద్ధ విమానం (5th generation fighter jet) తయారు చేసేందుకు ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 27 మే 2025న, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమానికి ప్రత్యేక ఆమోదం తెలిపారు. ఇది భారత రక్షణ రంగంలో ఒక కీలకమైన అడుగు అని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) పరిశ్రమల భాగస్వామ్యంతో అమలు చేస్తుంది, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు సమాన అవకాశాలను అందిస్తుంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో భాగంగా ఆత్మనిర్భర భారత్ కోసం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. 5వ తరం జెట్ యుద్ధ విమానం (5th generation fighter jet) తయారీ కోసం ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో AMCAను అభివృద్ధి చేస్తుంది.
AMCA అంటే ఏమిటి?
అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అనేది భారతదేశపు 5వ తరం స్టీల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (5th generation fighter jet). దీనిని భారత వైమానిక దళం (IAF) కోసం రూపొందించనున్నారు. ఈ విమానంలో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.
5th generation fighter jet AMCA ప్రత్యేకతలు ఇవే..
- ఇందులో రాడార్ నుండి తప్పించుకునే సామర్థ్యం ఉంది. దీన్ని శత్రువులు దానిని సులభంగా గుర్తించలేరు.
- ఆఫ్టర్‌బర్నర్ లేకుండా ధ్వని వేగం కంటే ఎక్కువగా ఎగరగల సామర్థ్యం ఇందులో ఉంటుంది.
- ఇందులో రాడార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు ఉన్నాయి.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఆటోమేటెడ్ నిర్ణయం తీసుకోవడంతో పాటు, నెట్‌వర్క్-కేంద్రీకృత యుద్ధానికి సహాయపడుతుంది.
- AMCA ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన ADA అభివృద్ధి చేస్తోంది.
-2030 నాటికి భారత వైమానిక దళానికి ప్రపంచ స్థాయి స్వదేశీ విమానాన్ని అందించమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు.
- ప్రస్తుతం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రాఫెల్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న సుఖోయ్ యుద్ధ విమానాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది.
- దీని బరువు సుమారు 25 టన్నులు ఇది రాఫెల్ మరియు సుఖోయ్ కంటే చిన్నదిగా ఉంటుంది
- ఈ యుద్ధవిమానం 1,000 కి.మీ కంటే ఎక్కువ పరిధిలో మాక్ 1.8+ వేగంగతో ప్రయాణిస్తుంది.
- ఈ విమానంలో ఆస్ట్రా, బ్రహ్మోస్-NG వంటి గాలి నుండి గాలికి, గాలి నుండి భూమికి, స్టెల్త్ క్షిపణులు ప్రయోగించనున్నారు.
- ప్రారంభంలో GE F414 ఇంజిన్, కానీ తరువాత స్వదేశంలో అభివృద్ధి చేసిన AL-51 ఇంజిన్ ఉపయోగించనున్నారు.






